Site icon NTV Telugu

Cricket: టీమిండియా బౌలింగ్ కోచ్ గా ఇంగ్లండ్ స్టార్ బౌలర్.. ఫోట్ వైరల్..!

Cricket

Cricket

ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా జూన్ 7 నుంచి 11 వరకూ ఇంగ్లాండ్‌లో ని ‘ది ఓవల్’ స్టేడియం వేదికగా జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. పదేండ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ నెగ్గాలని పట్టుదలతో ఉన్న రోహిత్ సేన ఆ మేరకు స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవుతోంది. తాజాగా భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచేందుకు బౌలింగ్ కోచ్‌గా ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను నియమించుకున్నట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో నిజం లేదు. జేమ్స్ అండర్సన్‌ను టీమిండియా బౌలింగ్ కోచ్‌గా నియమించారన్నది అసత్య ప్రచారం.

Also Read : Bridegroom escape: మరికొద్ది నిమిషాల్లో పెళ్లి.. అంతలోనే పెళ్లి కొడుకు ఉహించని ట్విస్ట్

డబ్ల్యూటీసీ ఫైనల్స్ ప్రిపరేషన్స్ లో భాగంగా ఇప్పటికే విరాట్, ఉమేశ్, శార్దూల్ ఠాకూర్ వంటి కొంతమంది ఆటగాళ్లు ఇంగ్లండ్ కి వెళ్లారు. ప్రాక్టీస్ సెషన్స్‌లో భాగంగా బీసీసీఐ.. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు కోచింగ్ సిబ్బంది, ఆటగాళ్లు భారత జట్టు కొత్త జెర్సీ అంబాసిడర్ (అడిడాస్)తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శార్దూల్, ఉమేశ్ యాదవ్ ల మధ్య ఉన్న వ్యక్తి సేమ్ అండర్సన్ లాగే ఉన్నాడు. దీంతో ట్విటర్‌లో నెటిజన్లు బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భారత్ బౌలింగ్ కోచ్‌గా జేమ్స్ అండర్సన్ ని నియమించింది అని షేర్ చేశారు.

Also Read : Andhra Pradesh: బదిలీలకు అప్పటి వరకు దరఖాస్తు పెట్టుకోవాలి.. ఇవి కీలకం..

దీంతో ఫోటోలో వైరల్ అవుతున్న వ్యక్తి అండర్సన్ కాదు.. టీమిండియా స్ట్రైంత్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ అంటూ బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. సైడ్ నుంచి చూస్తే సోహమ్ అచ్చం అండర్సన్ మాదిరిగానే ఉండటంతో నెటిజన్లు ఈ ఫోటోను వైరల్ చేశారు. టీమిండియతో అతడు ఏడాదికి పైగా ప్రయాణం చేస్తున్నాడు. భారత క్రికెటర్ల ఫిట్నెస్‌ బాధ్యతలు సోహమ్ దేశాయే చూసుకుంటాడు.

Exit mobile version