Site icon NTV Telugu

Jaiveer Reddy : ఎమ్మెల్యే నోముల భగత్‌పై జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి హాట్‌ కామెంట్స్‌

Jaiveer Reddy

Jaiveer Reddy

హలియాలో కాంగ్రెస్‌ యువజన నాయకుడు, మాజీమంత్రి కందూరు జానారెడ్డి తనయుడు జైవీర్‌ రెడ్డి చేపట్టిన గిరిజన చైతన్య యాత్ర ముగింపు సభను పెద్దవూర చింతపల్లి తండాలో కుందూరులో నిర్వహించారు. ఈ సభలో మాజీమంత్రి కుందూరు జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైవీర్‌ రెడ్డి మాట్లాడుతూ.. మేము ఉప ఎన్నికల సమయంలో గులాబీ కండువా కప్పుకుని ఉంటే… నువ్వు తిరిగి పెట్రోల్ బంకులను చూసుకునే వాడివని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పై మండిపడ్డారు జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి.

Also Read : Siddhi Idnani Pics: సిద్ది ఇదాని అందాల విందు.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జైవీర్ రెడ్డి రెండో విడత పాదయాత్ర ముగింపు సభలో ఎమ్మెల్యే లక్ష్యంగా విమర్శలు సంధించారు. మొదటి విడత పాదయాత్ర గిరిజన తండాల లో సాగగా 14 రోజులు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, రాజకీయ విమర్శలకు చోటు ఇవ్వకుండా పాదయాత్ర పూర్తి చేయగా…. రెండో విడత పాదయాత్రలో ఎమ్మెల్యే లక్ష్యంగా, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం లో అవకతవకలపై విమర్శలు చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు.

Also Read : Kethireddy Pedda Reddy: జేసీ ప్రభాకర్‌కి కేతిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

తాజాగా రెండో విడత పాదయాత్ర ముగింపు సభలో నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తామని పదవులు డబ్బు తమ లక్ష్యం కాదని…. పదవుల కోసం డబ్బు కోసం పార్టీ మారే నైజం జానారెడ్డిది కాదని ఎమ్మెల్యేకు కౌంటర్ ఇస్తూ జానారెడ్డి తనయుడు జైవీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నాగార్జునసాగర్ కాంగ్రెస్ సర్కిల్స్ లో కాక రేపుతోంది.

Exit mobile version