NTV Telugu Site icon

India vs China: భారత్ను రెచ్చగొట్టేలా చైనా కవ్వింపు చర్యలు..

Jaishankar

Jaishankar

భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో చైనా మరో దుందుడుకు చర్యకు దిగింది. చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదే అంటూ ఇటీవలే డ్రాగన్ కంట్రీ పేర్కొనింది. ఈ క్రమంలో చైనా మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ నిన్న ( సోమవారం ) ఈ కొత్త పేర్లను విడుదల చేసింది.

Read Also: Pawan Kalyan: పిఠాపురంలో నాల్గో రోజు జనసేనాని పర్యటన..

అయితే, అరుణాచల్‌ ప్రదేశ్ లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని వెల్లడించింది. ఈరోజు నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాది అవుతుందా?.. అరుణాచల్‌ ప్రదేశ్ కూడా భారత్‌లో ఒక రాష్ట్రం మాత్రమే అని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదు.. వాస్తవాధీన రేఖ వద్ద మా సైనం మోహరించి ఉందన్నారు. ఇదిలా ఉండగా.. భారత భూభాగంలోని ప్రదేశాలకు పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. చైనా 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రదేశాలకు, 2021లో 15 స్థలాలకు, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లను సైతం ప్రకటించింది.