Pakistan: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలమైన పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్.. తిరిగి పుంజుకునేందుకు కొత్త వ్యూహాలు అమలుచేస్తోంది. అందులో భాగంగా తొలిసారి ఆ సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజహర్ పేరుతో విడుదల చేసిన లేఖలో “జమాత్ ఉల్ ముమినాత్” పేరుతో మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు గతంలో పేర్కొంది. కొత్తగా ఏర్పడిన మహిళా విభాగం “జమాత్ ఉల్-ముమినత్” కోసం నియామకాలను విస్తరించడానికి తాజాగా మరో ప్లాన్ వేసింది.
READ MORE: Bengaluru Shocking: ఇంట్లో లివ్-ఇన్ జంట మృతి! దర్యాప్తులో ఏం తేలిందంటే..!
నిధులను సేకరించే ప్రయత్నాల్లో భాగంగా ‘తుఫత్ అల్-ముమినత్’ అనే పేరుతో ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఆన్‌లైన్ కోర్సులో మతపరమైన, జిహాద్ ఆధారిత పాఠాలు చెబుతారట. దీంతో జేఎం మహిళా బ్రిగేడ్‌లోకి మహిళలను లాగడానికి లక్ష్యంగా ఈ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులు నవంబర్ 8న ప్రారంభం కానున్నాయట. 40 నిమిషాల రోజువారీ సెషన్‌లను జెఎం చీఫ్ మసూద్ అజార్ సోదరీమణులు సాదియా అజార్, సమైరా అజార్ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే ప్రతి మహిళ రూ. 500 (500 పాకిస్థానీ రూపాయలు) విరాళంగా అందించాలని ప్రకటనలో కోరారు. వారు జోడించారు. ఈ క్లాసుల్లో భాగంగా మసూద్ అజార్, ఇతర కమాండర్ల బంధువులతో సహా జెఎంనాయకుల కుటుంబ సభ్యులు, జిహాద్, ఇస్లాం దృక్కోణం నుంచి పాల్గొనేవారికి వారి విధుల గురించి బోధిస్తారట. పాకిస్థాన్‌లోని సాంప్రదాయిక సామాజిక నిబంధనలు మహిళలను ప్రభావితం చేస్తాయని.. అందువల్ల ఈ సంస్థ వారిని నియమించుకోవడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు అని ఆయా వర్గాలు అంతర్జాతీయ మీడియా సంస్థకు తెలిపాయి.
READ MORE: Minister Satya kumar: మెడికల్ కాలేజీల నిర్మాణం పీపీపీ మోడల్లోనే జరుగుతుంది..
