Site icon NTV Telugu

Jairam Ramesh: తెలంగాణలో కేసీఆర్ మాయ మాటలకు కాలం చెల్లిపోయింది..

Jairam Ramesh

Jairam Ramesh

నవంబర్ 30న జరుగునున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్వహించబడుతుందని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. 9 సంవత్సరాల క్రితం సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు.. కేవలం ప్రకటించడమే మాత్రమే కాదు తెలంగాణ అభివృద్ధి చేసే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో హైదరాబాదును రాజధానిగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామని పుకార్లు వచ్చినప్పటికీ ఏకైక రాజధాని ప్రకటించామన్నారు.

Manda Krishna Madiga: సామాజిక న్యాయ సూత్రానికి కాంగ్రెస్ వ్యతిరేకం

9 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలయిందని తెలిపారు. తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీ.. ప్రజలకు మాయమాటలను చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల కుంపటిలోకి నెట్టేసిందని ఆరోపించారు. తెలంగాణలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీంలను ప్రకటించింది.. 6 గ్యారంటీ స్కీంలు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ రూపొందించిందని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి పథకాన్ని ఇప్పటివరకు అమలు చేశామని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల హామీలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్ లతో పాటు.. మేనిఫెస్టోను సైతం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ స్కీమ్ లతో పాటు మేనిఫెస్టో అన్ని పథకాల అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని జైరాం రమేష్ తెలిపారు.

CM YS Jagan: అంబేడ్కర్‌ స్మృతివనం, అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులపై సీఎం జగన్‌ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో అప్పులను కట్టడి చేస్తే ఆరు గ్యారంటీ స్క్రీంలతో పాటు మరిన్ని స్కీములను ప్రజలకు అందించే వెసులుబాటు ఉందని జైరాం రమేష్ అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చిన కేసీఆర్ దేశంలోనే పర్ క్యాప్ట ఆదాయంలో నెంబర్ వన్ అని మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఫర్ క్యాప్ట ఆదాయంలో హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసే హామీలను ఇస్తూ రెండుసార్లు అధికారంలోకి వచ్చారన్నారు. ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చేందుకు సంసిద్ధమయ్యారని.. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు కొనసాగుతాయని జైరాం రమేష్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ మాయమాటలకు కాలం చెల్లిపోయింది.

Exit mobile version