NTV Telugu Site icon

DIG Ravikiran: చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. డీఐజీ కీలక ప్రెస్‌మీట్‌

Dig Ravikiran

Dig Ravikiran

DIG Ravikiran: చంద్రబాబు భద్రత, ఆరోగ్యానికి సంబంధించి జైల్లో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్నారు. జైల్లో చంద్రబాబుకు ఆరోగ్యపరంగా, భద్రతాపరంగా ఎలాంటి సమస్య లేదన్నారు. మొదటి నుంచి ఆయనను హైప్రొఫైల్‌ ఖైదీగానే ట్రీట్‌ చేస్తున్నామన్నారు. స్కిన్‌ సమస్య రాగానే ప్రభుత్వ వైద్యులతో రూల్స్‌ ప్రకారం వైద్యం చేయించామని వెల్లడించారు. తాగునీరు, భోజన విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామన్నారు. జైలులో చంద్రబాబుకు పూర్తిస్థాయిలో భద్రత ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు సంబంధించిన భోజనాన్ని జైలర్ స్టాయి అధికారులు చెక్ చేస్తారని.. చంద్రబాబు బ్యారక్ నుంచి బయటికి వచ్చిన సమయంలో ఇతర ఖైధీలు అధికారులు, సిబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. పూర్తిస్థాయిలో ప్రికాషన్స్ తీసుకుంటున్నామని.. సెక్యూరిటీ మెజర్మెంట్స్‌కు సంబంధించి ప్రతి 10 రోజులకు ఒకసారి అధికారులతో మాట్లాడుతామన్నారు. చంద్రబాబు ఆరోగ్య రీత్యా జైల్లోకి వచ్చిన రోజు కొన్ని మందులు తీసుకొచ్చారని.. ఈ మందులు ఎప్పటికప్పుడు వేసుకుంటున్నారో లేదో వైద్యులు పరిశీలిస్తున్నారన్నారు. రోజుకు మూడుసార్లు వైటల్స్ టెస్ట్ చేస్తున్నామని డీఐజీ రవికిరణ్‌ తెలిపారు.

Also Read: Minister Amarnath: పవన్ ఓ పొలిటికల్ టూరిస్ట్.. రాజకీయాలకు ఆంధ్రా, నివాసానికి తెలంగాణ కావాలా…?

డీఐజీ మాట్లాడుతూ.. “చంద్రబాబు రూమ్‌లో 8 ఫ్యాన్లు పెట్టాం.. నిరంతరం తిరుగుతూనే ఉన్నాయి. 66 కేజీలు జైలుకు వచ్చినప్పుడు ఉన్నారు. ఇపుడు 67 కేజీలు ఉన్నారు. చంద్రబాబు కొంత డrహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఆయనకు అవసరమైనన్ని వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందజేశాము. ఆయన శరీరంపై రేషస్ వచ్చాయి. జీజీహెచ్ నుంచి స్పెషలిస్ట్ వైద్యులను రప్పించి పరీక్షలు చేయించాము. చంద్రబాబు జైల్లో అరోగ్యంగానే ఉన్నారు. హెల్త్ బులిటెన్ హెడ్ ఆఫ్ ది ఇనిస్టిట్యూషన్ ఇస్తారు. ఇకపై రెగ్యులర్‌గా చంద్రబాబు హెల్త్ బులిటన్ విడుదల చేస్తాము. చంద్రబాబు ఏ మందులు అయితే జైల్లోకి తీసుకువచ్చారో వాటిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 2039 మంది ఖైదీలు జైల్లో ఉన్నారు. వ్యక్తిగత వైద్యం ఇచ్చే పరిస్థితి లేదు. ఏసీ ప్రావిజన్ లేదు. ఆయనకు ఇన్ఫెక్షన్ ప్రమాదకర స్థాయిలో అయితే లేదు. చంద్రబాబు మా దగ్గర రిమాండ్ ప్రిజనర్.. ఆయనకు కావాల్సిన జాగ్రత్తలను తీసుకుంటున్నాం. జైల్లో వాటర్ పొల్యూషన్ జరుగుతుందని ఆరోపిస్తున్నారు అదే జరిగితే 2 వేల మంది ఖైదీలకు కూడా సమస్య రావాలి కదా. బ్యారక్‌ వరకూ ఫ్యామిలీ మెంబర్‌ను కూడా అనుమతించే పరిస్థితి లేదు.” అని ఆయన తెలిపారు.

Also Read: AP CM YS Jagan: మందులు అందడం లేదన్న మాట రోగుల నుంచి రాకూడదు..

చంద్రబాబు ప్రతి మూమెంట్ సీసీటీవీ ఫుటేజ్‌లో ఉందన్నారు డీఐజీ రవికిరణ్. భోజనం కూడా టెస్ట్ చేసి బ్యారక్ వరకు తీసుకెళ్లటం సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందన్నారు. స్నేహ బ్యారక్‌లో మొత్తం 100 మంది ఖైదీలు ఉండేవారని.. వాళ్ళందర్నీ వేరేచోట అకామిడేట్ చేశామన్నారు. చంద్రబాబు జైల్లోకి వచ్చిన విజువల్ ఎలా బయటికి వచ్చిందనే విషయంపై పరిశీలన జరుపుతున్నామన్నారు. కొన్ని రోజుల క్రితం ఓపెన్ ఎయిర్ జైలు వద్దకు ఒక డ్రోన్ వచ్చింది వెంటనే జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చామని, ఇప్పటివరకు అటువంటి సంఘటన పునరావృతం కాలేదన్నారు. చంద్రబాబును కోర్టుకు తరలించే ముందు కచ్చితంగా ఎనర్జీకి సమాచారం ఇస్తామన్నారు. పీటి వారెంటుకు సంబంధించి సమాచారం వచ్చింది. ఇకపై రెగ్యులర్‌గా చంద్రబాబు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేస్తామని డీఐజీ స్పష్టం చేశారు. మాపై ఎటువంటి ప్రెషర్ లేదన్నారు. చంద్రబాబుకు ఎల్లప్పుడూ ఒక పర్సన్ ఎదురుగా ఉన్న బ్యారక్‌లో అందుబాటులో ఉంటారు. లీగల్ ఇంటర్వ్యూస్ ఎవరైతే చంద్రబాబుకు రిప్రజెంట్ చేస్తారు వాళ్ళని మాత్రమే తీసుకుంటామన్నారు కోస్తా జిల్లాల జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్.