Site icon NTV Telugu

Jailer song : వావ్..ఉగాండా చిన్నారులు డాన్స్ అదరగొట్టారుగా..

Whatsapp Image 2023 08 25 At 10.29.39 Pm

Whatsapp Image 2023 08 25 At 10.29.39 Pm

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఇటీవల విడుదల అయ్యి ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఈ సినిమాలో కావాలయ్యా పాట కూడా సూపర్ ట్రెండింగ్ అయింది. ఈ పాటకు అనిరుద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అద్భుతం అని చెప్పాలి.ఈ పాటలో తమన్నా డాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు . ఈ సాంగ్లో తమన్నా తన గ్లామర్ తో పాటు డాన్స్ తో అదరగొట్టింది.జైలర్ సినిమా విడుదలకు ముందు బాగా పాపులర్ కావడానికి ఈ పాటనే ప్రమోషన్స్ కి ఎక్కువగా ఉపయోగించుకున్నారు.ఇప్పటికే కోట్లాది మంది మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్న ఈ పాట  యూట్యూబ్ లో 100మిలియన్ల కు పైగా వ్యూస్ ని క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ పాట విదేశాల్లో మారు మ్రోగుతుంది.

తాజాగా ఉగాండా లోని కొంతమంది చిన్నారులు ‘కావాలయ్యా’ పాటకు అదిరిపోయే విధంగా డాన్స్ వేశారు. ఈ పాట ఆలపించిన సింగర్ శిల్పారావు ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక ఈ వీడియోలో ఉగాండాకు చెందిన కొందరు చిన్నారులు బార్సిలోనా కి సంబంధించిన జెర్సీని వేసుకొని ఓ బిల్డింగ్ ముందు ‘కావాలయ్యా’ పాటలోని అదరగొట్టే స్టెప్స్ వేశారు.ఇక వీడియో చివర్లో ఓ పిల్లవాడు డాన్స్ చేస్తూ ఫుట్బాల్ ట్రిక్స్ ని కూడా చూపించడం ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన చేసిన శిల్పారావు పలు ఆసక్తికర కామెంట్స్ కూడా చేసింది ” మీ డాన్స్ సూపర్ డూపర్ గా, చాలా అద్భుతంగా ఉంది. నా పాటకు డాన్స్ చేసినందుకు మీ అందరికి థాంక్స్. ఆఫ్రికాలో ఉన్న అందరికీ నా కృతజ్ఞతలు మీరు నా రోజుని మరింత అద్భుతంగా మార్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కామెంట్స్ చేసారు.

https://www.instagram.com/reel/CwR3JIvtGz-/?igshid=MTc4MmM1YmI2Ng==

Exit mobile version