Jailer 2 : రజనీకాంత్ సినిమాను పవన్‌కల్యాణ్ ఎందుకు రిజెక్ట్ చేశాడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజనీకాంత్ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆయన పక్కన ఒక్క ఫ్రేమ్‌లో కనిపిస్తే చాలు అని కోరుకునే నటులు ఎందరో. అయితే, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సెన్సేషనల్ సీక్వెల్ జైలర్ 2′ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి హేమాహేమీలు మెరిసి సినిమా స్థాయిని పెంచగా, రెండో భాగంలో కూడా అంతకు మించిన స్టార్ కాస్ట్‌ను సెట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ, అనూహ్యంగా ముగ్గురు టాప్ స్టార్స్ ఈ ప్రాజెక్ట్‌కు ‘నో’ చెప్పడం ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘జైలర్’ ఫస్ట్ పార్ట్‌లోనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ కోసం నందమూరి బాలకృష్ణను అనుకున్నారు. అప్పుడు కుదరలేదు సరే, పార్ట్ 2లోనైనా తలైవా-బాలయ్య కాంబో చూడొచ్చని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూశారు.
Also Read:Mangli: పంజాగుట్ట పీఎస్‌కు తాగి వచ్చిన మంగ్లీపై ఫిర్యాదు చేసిన న్యాయవాది
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
కానీ తాజా సమాచారం ప్రకారం బాలయ్య ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ‘రెమ్యునరేషన్’ అని ఒక వర్గం అంటుంటే, తన పాత్ర నిడివి తక్కువగా ఉండటం వల్ల ఆయన ఆసక్తి చూపలేదని మరో టాక్. ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న బాలయ్య, కేవలం ఎలివేషన్ కోసం చేసే అతిథి పాత్రల కంటే వెయిట్ ఉన్న రోల్స్ కే మొగ్గు చూపుతున్నారట. షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో కనిపిస్తారని గట్టిగా ప్రచారం జరిగింది. రజనీకాంత్‌తో ఉన్న స్నేహం దృష్ట్యా ఆయన ఒప్పుకుంటారని చిత్ర యూనిట్ భావించింది కానీ తన తదుపరి చిత్రం ‘కింగ్’ పనుల్లో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక షారుఖ్ సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్‌పై గౌరవం ఉన్నప్పటికీ, సినిమా కథా పరంగా తన పాత్రకు ప్రాధాన్యత తక్కువని భావించి ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ ఇద్దరూ కాదన్నాక, మేకర్స్ పవన్ కల్యాణ్ ను కూడా సంప్రదించారట. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో బిజీగా ఉన్న పవన్ ఓకే అంటే సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుందనడంలో సందేహం లేదు. అయితే రాజకీయ బాధ్యతలు, పెండింగ్‌లో ఉన్న సొంత సినిమాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్‌కు ఎంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?