NTV Telugu Site icon

Manish Sisodia: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలిసేందుకు అనుమతి మంజూరు..

Manish

Manish

ఢిల్లీ మాజీ మంత్రి, జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు తన భార్యను కలిసేందుకు అనుమతి మంజూరు చేసింది. కస్టడీ పెరోల్ లో వారానికి ఒకసారి అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా.. అంతకుముందు తన భార్యను వారానికి రెండుసార్లు కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సిసోడియా తన దరఖాస్తులో కోరారు. కాగా.. మనీష్ సిసోడియా భార్య గత 20 సంవత్సరాలుగా మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో బాధపడుతోంది.

Read Also: Lok sabha: మాల్‌ప్రాక్టీస్‌‌పై కేంద్రం ఉక్కుపాదం.. లోక్‌సభలో బిల్లు

ఈ క్రమంలో.. రౌస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఫిబ్రవరి 2న దరఖాస్తుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నోటీసు జారీ చేశారు. ఇదిలాఉంటే.. మద్యం పాలసీ స్కామ్‌కు సంబంధించి మనీష్ సిసోడియా ఫిబ్రవరి 2023లో అరెస్టయ్యాడు. మనీష్ సిసోడియాను ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుల్లో ఈడీ, సీబీఐ అరెస్టు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. మనీష్ సిసోడియా కార్యకలాపాల వల్ల దాదాపు రూ. 622 కోట్ల నేరాలు జరిగాయని ఈడీ ఆరోపించింది. కాగా.. గతేడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయగా.. మార్చి 9న ఈడీ అరెస్టు చేసింది. మరోవైపు.. సిసోడియా రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ ఫిబ్రవరి 12న జరగనుంది.

Read Also: Rahul Gandhi: బొగ్గు రవాణా కార్మికులతో రాహుల్.. 200 కిలోల బొగ్గు ఉన్న సైకిల్ నడిపిన నేత