తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్’ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హీరో చిత్రం సెన్సేషనల్ హిట్ కావడంతో, దీనికి సీక్వెల్‌గా రాబోతున్న ‘జై హనుమాన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి ఒక షాకింగ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తుండగా, మొదటి పార్ట్ హీరో తేజ సజ్జ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడనే వార్త అభిమానులను కంగారు పెడుతోంది. రిషబ్ శెట్టి రాకతో తేజ పాత్ర కనుమరుగైందని, అందుకే అతను తప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది. కానీ,
Also Read : Mahesh Anand : 5 పెళ్లిళ్లు, 12 ఎఫైర్లు.. చివరకు సోఫాపై కుళ్ళిన శవమైన నటుడు..
ఈ ప్రచారంలో నిజం లేదని చెప్పాలి. ‘జై హనుమాన్’ లో తన పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని, రిషబ్ శెట్టి పాత్రే ప్రధానంగా సాగుతుందని తేజ సజ్జ గతంలోనే స్పష్టం చేశారు. దీనికి తోడు దర్శకుడు ప్రశాంత్ వర్మతో తేజ కి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా అతను సినిమా నుంచి తప్పుకునే అవకాశం లేదు. ఇప్పటికే వీరిద్దరూ ‘జాంబీ రెడ్డి’ వంటి హిట్స్ కొట్టడమే కాకుండా, దానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి ‘కాంతార 1’ పనుల్లో బిజీగా ఉండటం వల్లే షూటింగ్ ఆలస్యమైంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. కాబట్టి, తేజ సజ్జ తప్పుకున్నాడనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టమవుతోంది.
