కొండా సురేఖ ది తప్పే లేదని జగ్గారెడ్డి అన్నారు. కేటీఆర్.. నీ సోషల్ మీడియా తప్పుగా ట్రోల్ చేసిందన్నారు. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్.. పెద్దరికంగా వ్యవహారం ఉండాల్సిందని సూచించారు. మీ సోషల్ మీడియా నీ కంట్రోల్ చేయకపోవడం తప్పన్నారు. పుండు మీద కారం చల్లినట్టు కేటీఆర్ చేశారన్నారు. “అసలే కొండా సురేఖ ఫైర్ బ్రాండ్.. ముట్టుకోకుంటే ఏం అనదు. తెలిసి కూడా ఎందుకు అమే జోలికి పోయావు. మీ పార్టీలో కేసీఆర్.. కేటీఆర్‌లకు దండలు వేసిన ఆడవాళ్ళను అలాగే చూస్తారా? ఇంత పరిజ్ఞానం కూడా బీఆర్‌ఎస్‌కి లేక పోవడం బాధకారం. బీఆర్‌ఎస్ వాళ్ళు ఎలాంటి సంస్కృతి తెస్తున్నారు. పదేళ్లు రాజభోగాలు అనుభవించారు కదా..?. ఇంకో పదేళ్ల పాటు ఓపిక పట్టు కేటీఆర్.. పరిపూర్ణత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకో” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Benjamin Netanyahu: ఇరాన్ దాడి సమయంలో బంకర్‌లోకి నెతన్యాహు పరుగులు.. నిజమెంత?
రాజకీయ పరిపూర్ణత లేని నాయకుడిగా మిగలవద్దని కేటీఆర్‌కి జగ్గారెడ్డి సూచించారు. “కొండా సురేఖ కి కేటీఆర్ క్షమాపణ చెప్పు..కేటీఆర్ తప్పు చేసి డిస్ట్రబ్ చేసి.. ఆమెకు అనే అవకాశం మీరు ఇచ్చారు. కేటీఆర్ ఇంట్లో ఉన్న ఆమెని రెచ్చగొట్టి.. తన్నించుకుంటున్నారు. కొండా సురేఖతో కొట్లాడుడు అంత ఈజీ కాదు. రాహుల్ గాంధీపై కేటీఆర్ నింద వేయడం సరికాదు. గాంధీ కుటుంబం నుంచి ప్రజలకు బాగా తెలుసు. 52 ఏండ్లు దేశాన్ని పాలించింది రాహుల్ గాంధీ కుటుంబం. వాళ్ళ ఆస్తులు..ప్రభుత్వ బంగ్లా లే. మీరు సంపాదించింది ఎంత..?.అంతా..మీలాగా.. మీ నాన్న లాగా సంపాదిస్తారు అనుకోకండి. రాహుల్ గాంధీ ఒక్క మాట చెప్తే.. పువ్వుల్లో పెట్టుకుని పెంచుతాం మా పార్టీ.. కార్యకర్తలు. కేటీఆర్ టెంప్ట్ అయ్యి మాట్లాడుతున్నారు. పనికి మాలిన మాటలు మాట్లాడకు కేటీఆర్.రాహుల్ గాంధీ పై అబండాలు వేస్తే ఊరుకోం.” అని హెచ్చరించారు.