Site icon NTV Telugu

Thota Narasimham: మరొకసారి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి..

Thota Narasimham

Thota Narasimham

Thota Narasimham: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో వేగంగా దూసుకెళ్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం ప్రచారంలో వేగం పెంచారు. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం వీరవరంలో వైసీపీ అభ్యర్థి తోట నరసింహం సగర కులస్తుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. కులాలు, మతాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతుందని అన్నారు.

ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, కాకినాడ ఎంపీగా సునీల్‌ను గెలిపించాలని కోరారు.. జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. మరొకసారి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. జగ్గంపేట వైసీపీకి కంచుకోట అని.. హ్యట్రిక్ విజయం ఇచ్చి మరొకసారి రుజువు చేయాలని అన్నారు.

Exit mobile version