Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయనని స్పష్టం చేసిన ఆయన.. అయితే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పూర్తిగా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ 117 స్థానాల్లో విజయం సాధించాలని సీఎం లక్ష్యంగా పెట్టుకోవడం మంచి ఆలోచన అని అన్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే పార్టీని సిద్ధం చేయడం రాజకీయ నాయకుడిగా సీఎం తీసుకున్న సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
- Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది వ్యక్తిగత నిర్ణయం కాదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికను పార్టీ, ఇన్చార్జి, ఏఐసీసీ కలిసి నిర్ణయిస్తాయని చెప్పారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందని, అందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి స్పందించడం సహజమని జగ్గారెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధుల పనితీరును సమీక్షించే హక్కు సీఎంకు ఉంటుందని చెప్పారు. సీఎం ఇచ్చే సూచనలను ఎమ్మెల్యేలు స్వీకరించి తమ పనితీరును మెరుగుపర్చుకుంటే వారికి రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని సూచించారు. అలాగే పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వాలా లేదా అనే విషయాన్ని కూడా పార్టీ నాయకత్వం పరిశీలించే అవకాశం ఉంటుందని అన్నారు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు చేసే సర్వేలపై కూడా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నిర్వహించే సర్వేల్లో ఆ పార్టీకి అనుకూల ఫలితాలే వస్తాయని, అలాగే బీజేపీ కూడా తమకు అనుకూలంగా అధికారంలోకి వస్తామని చెప్పే సర్వేలను ప్రచారం చేస్తుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం ఎప్పుడూ అధికార పార్టీని బలహీనపరిచే ప్రయత్నమే చేస్తుందని, అదే రాజకీయ స్వభావమని అన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యేలకు జగ్గారెడ్డి కీలక సూచనలు చేశారు. “మేం తోపులం” అనే భావనలో ఉంటే అది పొరపాటేనన్నారు. గతంలో ఎంతో బలమైన నాయకులుగా భావించిన వారే ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు బలంగా కనిపించినా, ఎన్నికల సమయంలో బి-ఫారం ఇచ్చే అధికారం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ నాయకత్వం చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. వారు అంగీకరించకపోతే టికెట్ దక్కదని స్పష్టం చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్మల పోటీ చేస్తారని జగ్గారెడ్డి తెలిపారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం లేదని, కేవలం సంగారెడ్డి నుంచి మాత్రమే పోటీ చేయనని స్పష్టం చేశారు. వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలా.? వద్దా.? అనేది పూర్తిగా పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్లో వచ్చే ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సంగారెడ్డి కాకుండా మరో నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
-
Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
-
Saif Ali Khan: బట్టలు లేకుండా నటించమన్నారు… 20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!