Site icon NTV Telugu

Jaggareddy: అబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్.. జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

Cm Kcr, Jaggareddy

Cm Kcr, Jaggareddy

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్.. కల్వకుంట్ల పేరు తీసేసి అబద్ధాల కేసీఆర్ అని పెట్టాలన్నారు. కేసీఆర్ బాధ కరెంట్ గురుంచి కాదు.. పొలిటికల్ పవర్ లేదని ఆరోపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కేసీఆర్ భోజనం చేసేటపుడు మూడు సార్లు కరెంట్ పోయింది అంటే ఎవరు నమ్మరని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఎప్పుడు విడిపోతే అప్పుడు సీఎం కావాలి అనుకునేవాడు కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణ విభజన తరువాత ప్రజలు ఎట్లా జీవిస్తున్నారని ప్రజలని ఎప్పుడైనా కేసీఆర్ అడిగారా అని ప్రశ్నించారు. నిజాన్ని అబద్ధాలుగా ఎట్లా మరల్చి ప్రజలకి ఎట్లా చెప్పాలో కేసీఆర్ కి తెలుసని ఎద్దేవా చేశారు.

Hinglaj Mata festival: పాకిస్తాన్‌లో “హింగ్లాజ్ మాత” తీర్థయాత్ర.. లక్షలాదిగా హిందువులు హాజరు..

కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు ప్రజలు గుర్తులేరు.. ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రజలు గుర్తొచ్చారా అని జగ్గారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలు పొలిటికల్ పవర్ కట్ చేసారు.. గత్యంతరం లేక కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ ఎప్పుడైనా సెక్రటేరియట్ లో ప్రజలకి అందుబాటులో ఉన్నారా.? అని ప్రశ్నించారు. పది సంవత్సరాలు కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు ట్విట్టర్ లేదు .. ప్రతిపక్షంలోకి వచ్చాక ట్విట్టర్ వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 పార్లమెంట్ సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Kakarla Suresh: ఉదయగిరిలో టీడీపీ ప్రచార జోరు..

Exit mobile version