Site icon NTV Telugu

Jagga Reddy : ఇంత చిల్లర వ్యవహారం ఏ పార్టీ కూడా చేయలేదు

Jagga Reddy Brs Congress

Jagga Reddy Brs Congress

గాంధీ కుటుంబం మీద మోడీ ఎంత కక్ష పెంచుకున్నాడు అనే దానికి అనర్హత వేటు నిదర్శనమన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాహుల్‌ గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటుపై నేడు హైదరాబాద్‌ గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ లో గాంధీ అనే పేరు వినొద్దనే ఆలోచన లో మోడీ ఉన్నారని, ఇంత చిల్లర వ్యవహారం ఏ పార్టీ కూడా చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ మాటలు తట్టుకోలేక పోతుంది బీజేపీ అని, రాహుల్ గాంధీపై రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు. రాహుల్ గాంధీకి.. ఎంపీ పదవి నథింగ్ అని, పార్లమెంట్ లో ఉన్నా.. బయట ఉన్నా.. గాంధీ కుటుంబం కి విలువ ఉందన్నారు.

Also Read : Puvvada Ajay Kumar : ఖమ్మంలో ఎక్కడ చూసినా నేను చేసిన అభివృద్ధే కనిపిస్తోంది

రాజకీయ విలువలున్న అద్వానీ ని ప్రధాని కాకుండా అడ్డుకున్నారు మోడీ అని ఆయన ఆరోపించారు. మన్మోహన్ సింగ్.. రాహుల్ గాంధీని ప్రధాని కావాలని చెప్పినా లైట్ తీసుకున్నారన్నారు. మోడీ పదే పదే అద్వానీ కాళ్ళు మొక్కారని, మొక్కిన కాళ్ళని లాక్కున్నాడు మోడీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులను మోసం చేసిన వాళ్లు మోడీ లే కదా అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. అలాంటప్పుడు అనుమానం రావడం సహజమన్నారు. బీజేపీది క్రిమినల్ ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. క్రిమినల్ మైండ్ తో నడుస్తున్న ప్రభుత్వం ఇది అని ఆయన అన్నారు.

Also Read : Nayanthara: ఇదెక్కడి కాంబో.. ప్రదీప్ సరసన నయన్..?

Exit mobile version