NTV Telugu Site icon

Jagga Reddy : ప్రోటోకాల్ గురించి కేటీఆర్.. హరీష్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది

Jaggareddy

Jaggareddy

ప్రోటోకాల్ గురించి కేటీఆర్.. హరీష్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలన ముందు కేటీఆర్.. హరీష్ ల అనుభవం చాలా చిన్నది.. వాళ్ల వయస్సు చిన్నదని, ఎంపీ గా రేవంత్ ఉన్నప్పుడు ఆయన నియోజక వర్గంలో ప్రోటోకాల్ పాటించారా కేటీఆర్.. హరీష్ ఎప్పుడైనా..? అని ఆయన ప్రశ్నించారు. మీరు ప్రోటోకాల్ పాటించకుండా.. ఇప్పుడు సిఎం రేవంత్ నీ ప్రోటోకాల్ గురించి అడగడంలో అర్థం లేదని, సంగారెడ్డి లో గెలిచిన నన్ను పక్కన పెట్టీ ఓడిపోయిన వ్యక్తితో శంకుస్థాపనలు చేయించలేదా హరీష్ అని ఆయన అన్నారు. అప్పుడేమో చిలిపి చేష్టలు.. ఇప్పుడేమో వగలాడి మాటలు అని జగ్గారెడ్డి అన్నారు. ప్రోటోకాల్ విషయంలో కేటీఆర్ హరీష్ నాలుగు రోజులు ఒకసారి కాంగ్రెస్‌పై నిందలు వేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రుల పైన ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ పాలన ముందు కేటీఆర్ హరీష్ ల అనుభవం చాలా చిన్నది.. వాళ్ల వయస్సు చాలా చిన్నదన్నారు జగ్గా రెడ్డి అన్నారు.

అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ పరిపాలన అనుభవం ముందు మీరు చిన్నపిల్లలు. మీరు 10 ఏళ్లు అధికారంలో ఉన్నా అ ఆ ఇ ఈ లు కూడా నేర్చుకోలేదు. కాంగ్రెస్ కి పాఠాలు చెప్పే వయసు మీది కాదు.. ఆ మెచ్యూరిటీ కూడా మీకు రాలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నా.. నన్నే పిలిచారు. వైఎస్.. కిరణ్ కుమార్ రెడ్డి హయంలో కూడా ప్రతిపక్ష నేతలకు కూడా ప్రోటోకాల్ ఇచ్చింది.. అపాయింట్ మెంట్ ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కేటీఆర్..హరీష్ లు వైఎస్..కిరణ్ కుమార్ రెడ్డి లను కలవలేదా..?. సీఎం లు మీ నియోజక వర్గానికి వచ్చినా… మిమ్మల్ని పిలిచారు.. శంకుస్థాపనలు చేయించారు.. మర్చిపోవడం మీ మతిమరుపు కి నిదర్శనం. ప్రోటోకాల్ కి పుట్టిన ఇల్లు కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్… హరీష్ మైండ్ స్కానింగ్ చేయించుకోండి.. మర్చిపోతే.. పార్టీలు మారడం.. మామూలే.. సీరియస్ మ్యాటర్ కాదు. కాంగ్రెస్.. నుండి బీఆర్ఎస్‌.. బీఆర్‌ఎస్‌ నుండి కాంగ్రెస్ లోకి రావడం కామన్. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. పాలిటిక్స్..అత్తారిల్లు..తల్లిగారి ఇల్లు లాగ మారిపోయాయి. ప్రోటోకాల్ మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు హరీష్… కేటీఆర్. రేవంత్.. మీ హయంలో ఎంపీ గా ఉన్నాడు కదా.. రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజక వర్గంలో పర్యటించినప్పుడు కేటీఆర్ కానీ..హరీష్ కానీ పిలిచారా..?. దీనికి జవాబు చెప్పండి. ఎంపీ గా రేవంత్ కి ప్రోటోకాల్ ఇవ్వనప్పుడు… ఇప్పుడు సిఎం రేవంత్ నీ ప్రశ్నించే హక్కు లేదు. మున్సిపల్ శాఖ కమిషనరేట్ కి వెళ్తా అంటే రోడ్డుమీద ఆపేశారా ..? లేదా..? రేవంత్ నీ సెక్రటేరియట్ కి పోకుండా ఆపింది నిజం కదా..? దీనికి హరీష్..కేటీఆర్ సమాధానం చెప్పగలరా? అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ సంపత్..

కోమటిరెడ్డి లను అసెంబ్లీ కి రాకుండా సస్పెండ్ చేసింది మర్చిపోయారా..? అప్పుడు చిలిపి చేష్టలు.. ఇప్పుడేమో వగలాడి మాటలు. ప్రతిపక్షాలను ఎలా గౌరవించాలి అనేదే మీకు తెలియదు. మీ పదేళ్ల లో ప్రతిపక్ష ఎంఎల్ఏ లకు అపాయింట్ మెంట్ ఇచ్చారా. సీఎం గా కేసీఆర్ ఉన్నప్పుడు.. సొంత మంత్రులకే అపాయింట్ మెంట్ ఇవ్వలేదు..నిజం కాదా.? 2019 లో నేను సంగారెడ్డి లో ఎంఎల్ఏ. హరీష్ రావు ఓడిపోయిన వ్యక్తితో శంకుస్థాపన చేయించలేదా..?. కలక్టర్ కూడా మాకు ఆహ్వానం పలకలేదు.. నేనే ఉదాహరణ.. కానీ నేను జాలిపడ్డ. ప్రోటోకాల్ గురించి brs వాళ్ళు మాట్లాడటం సిగ్గుచేటు. మా మంత్రుల ఛాంబర్ లు కిటకిటలాడుతున్నాయి. రోడ్లు కావాలని.. ప్రజల సమస్యలు తీర్చండి అని వస్తున్నారు. పవర్ పోయే సరికి brs వాళ్ళు జీర్ణించుకోలేక పోతున్నారు. పనికి మాలిన ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు. సెక్రటేరియట్ లో ఉద్యోగులు టెన్షన్ లేకుండా పని చేస్తున్నారు.. ఉద్యోగులే చెప్తున్నారు. నీ పదేళ్ల కాలం లో రేషన్ కార్డు దిక్కు లేదు. పదేళ్ల తర్వాత మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తుంది కాంగ్రెస్ సర్కార్. సబితా ఇంద్రారెడ్డి కి కుర్చీ వేశారు.. నీకు కుర్చీ వేయకపోతే అడుగు.. నీకు గౌరవం ఇచ్చిన తర్వాత.. మా klr నీ గౌరవించారు. తప్పేముంది.. మా కేటీఆర్ కి వేసింది కాంగ్రెస్ కుర్చీ.. ఎంఎల్ఏ కుర్చీ సబిత కి వేశారు. దీంట్లో రాద్ధాంతం చేసి పరువు తీసుకోకు. కేసీఆర్ ప్రోటోకాల్ పాటించనప్పుడు ఈటెల రాజేందర్ ఎందుకు మాట్లాడలేదు. . అప్పుడు మాట్లాడలేని ఈటెల ఇప్పుడు ప్రశ్నించడం లో అర్థం లేదు’ అని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.