420 ఎవరు..? రాష్ట్రానికి దళితుడ్ని సీఎం చేస్తా అని.. చీటింగ్ చేసింది ఎవరు అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. మూడెకరాల ఇస్తా అని మోసం చేశావని ఆయన ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి..ఇస్తా అని చీటింగ్ చేశావని, ఆరోగ్య శ్రీ ఎత్తేశావు చీటింగ్ చేశారన్నారు. లక్ష రుణమాఫీ ఒకే సారి అన్నావు.. ఇది చీటింగ్ అని, డబుల్ బెడ్ రూమ్ ఇస్తా అన్నావు ..ఇదో చీటింగ్ అని ఆయన అన్నారు. పేపర్ లికేజ్ చేసిన.. మీ కుటుంబం మీద ఇదో చీటింగ్ కేసు అని, 12 శాతం ముస్లిం రిసేర్వేషన్ ఇస్తానని చీట్ చేశావన్నారు.
అంతేకాకుండా.. ‘రైతులకు సంకెళ్లు వేశావు..ఇది చీటింగ్. 57 ఏండ్ల కు పెన్షన్ అని చీట్ చేశావు. ఇన్ని చీటింగ్ చేసిన మీపై ఎన్ని కేసులు పెట్టాలి. బీఆర్‌ఎస్ చేసిన చీటింగ్ లపై కేసులు వేయాలి. కోర్టుకు వెళ్ళాలి. నిన్ననే తాళి కట్టినం. అప్పుడే కాపురం విశేషాలు అడిగితే ఎట్లా. బావ బామ్మర్ది కి అంటే తెలియదు. కేసీఆర్ కి తెలియదా. నెల రోజులు కాలేదు 420 అంటావా. ఎట్లా కనిపిస్తుంది కాంగ్రెస్. తెలంగాణని కేసీఆర్ మోసం చేసిన 420 అనే.. కాంగ్రెస్ ని గెలిపించారు. తెలంగాణ ప్రజలు అసలు 420 లు కేసీఆర్ కుటుంబం అని కాంగ్రెస్ కి ఓటేశారు. బీఆర్‌ఎస్ వాళ్ళ కోసం 840 చట్టం తేవాలి. 840 చట్టం చేయమని ప్రధాని ని అడుగుతాం.. ఆయన కూడా చట్టం తేకుంటే.. ఆయన్ని కూడా 840 కింద జమ చేయాలి. రేవంత్ సిన్సియర్ గా పని చేస్తున్నారు. కేంద్ర మంత్రులను కలిసి నిధులు సమకూర్చుకుంటున్నారు. రేవంత్..భట్టి.. వంద రోజుల్లో ఎలా సెటిల్ చేయాలనే పనిలోనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ రెండేళ్లు ఓపిక పట్టి.. ప్రశ్నించాలి అప్పుడు గౌరవం గా ఉంటుంది.
బీఆర్‌ఎస్.. బీజేపీ కలిసి ఒక్క అబద్దాన్ని వెయ్యి సార్లు చెప్తున్నారు. బీఆర్ఎస్.. బీజేపీ ఇద్దరు పాలోల్లే. పగలు కొట్లాడుతరు.. రాత్రి కల్లు దుకాణం దగ్గర కలుస్తరు. కేటీఆర్.. హరీష్.. కాంగ్రెస్ కి గంజాయి బ్యాచ్ లెక్క తయారైంది. మేము ఎంత మంచి పని చేసినా.. కేటీఆర్..హరీష్ బదనం చేసే పనిలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ని గెలికితే.. మీ బండారం బయట పెడతా. రేవంత్ పాలన బాగుంది. పరిపాలన ని పరుగులు పెట్టిస్తున్నారు. జగ్గారెడ్డి పేరే బ్రాండ్. పదవులతో బ్రాండ్ రాలేదు. పార్టీ మాకు చాలా అవకాశం ఇచ్చింది. నేను ఫ్రీ గా ఉన్నా. వారానికి రెండు రోజులు పార్టీ కి ఇస్తా. కేటీఆర్ కి జగ్గారెడ్డి కౌంటర్. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంటు లో మీ అయ్యా ఉన్నాడా. సోనియా గాంధీ.. రాహుల్ గాంధీ లే ఉండి బిల్లు పాస్ చేశారు. నాయనా నువ్వు ఎక్కడ ఉన్నావు ఆ రోజు అని అడుగు. తర్వాత మమ్మల్ని అడుగు.’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
