Jagapathi Babu: ఆ సినిమా షూటింగ్‌కి వెపన్ పట్టుకెళ్లిన జగపతి బాబు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu: జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రం విడుదలైన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణం ఉందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆ తరుణంలో ఒక సీనియర్ హీరో ‘జై బోలో తెలంగాణ’ చిత్రంలో నటించాలనే సంచలన నిర్ణయం తీసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆనాటి అనుభవాలను, ఎదురైన సవాళ్లను జగపతి బాబు పంచుకున్నారు.
READ ALSO: Maa Inti Bangaram: థియేటర్లలో సమంత రచ్చ అప్పుడే! ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
Also Read
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ సినిమా షూటింగ్ కోసం వరంగల్ వెళ్లాల్సి వచ్చినప్పుడు పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన తండ్రి ఫోన్ చేసి.. “వద్దురా.. ఇప్పుడు అక్కడ షూటింగ్ చేయడం కరెక్ట్ కాదు, నాకు భయంగా ఉంది, తిరిగి వచ్చేయ్” అని వారించారని చెప్పారు. కానీ, ప్రజలు తనను అంతగా హర్ట్ చేస్తారని తాను అనుకోలేదని, అందుకే మొండిగా ముందుకు వెళ్లానని వివరించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో త్రెట్స్ (బెదిరింపులు) రాకపోయినప్పటికీ, ఆంధ్రాలో ఉన్న తన అభిమానులు, ప్రజలు మాత్రం కొంత బాధపడ్డారని ఆయన తెలిపారు. “మనవాడు వెళ్లి అక్కడ ఆ సినిమా చేశాడేంటి?” అని తిట్టుకున్న వారు కూడా ఉన్నారని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే, షూటింగ్ సమయంలో ముందు జాగ్రత్తగా తన వద్ద ఒక వెపన్ (గన్) ఉంచుకున్నట్లు ఆయన వెల్లడించారు. “నా దగ్గర గన్ ఉండేది, కానీ వేల మంది తిరగబడితే ఆ ఒక్క గన్ ఏం చేయగలదు?” అని ఆయన ఆనాటి ఉద్విగ్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. వరంగల్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు భయాందోళనలు ఉన్నప్పటికీ, అక్కడి ప్రజలు తనను ఎంతో గౌరవంగా చూసుకున్నారని జగపతి బాబు గుర్తు చేసుకున్నారు.
READ ALSO: Indian Stock Market: 5 రోజుల్లో రూ.63 వేల కోట్లు సంపాదించారు.. ఎలాగో తెలుసా?
తాజావార్తలు
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!