Dana Cyclone: ప్రస్తుతం ‘దానా’ తుఫాను బంగాళాఖాతం వైపు వేగంగా కదులుతోంది. ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఒడిశాపై పడనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం పలు సన్నాహాలు చేసింది. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు ప్రధాన ఆలయాలైన జగన్నాథ ఆలయం, కోణార్క్ ఆలయాలను భక్తుల కోసం మూసివేసింది. ఈ ఆర్డర్ ప్రస్తుతం అక్టోబర్ 25 వరకు అమలులో ఉండనుంది. ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేసి నిరన్యం తీసుకుంటారు. ఆ తర్వాత ఆలయాలను తెరవడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
Read Also: AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్..
జగన్నాథ దేవాలయం, కోణార్క్ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. ప్రతిరోజు భారతదేశంతో సహా ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు తీర్థయాత్రలకు వస్తుంటారు. ఈ రద్దీని నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. తుఫాను సంభవించినప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ రెండు ఆలయాలను 25 వరకు మూసివేసింది. దేవాలయాలతో పాటు రాష్ట్ర మ్యూజియంలు కూడా మూసివేయబడ్డాయి.
Read Also: Maharashtra NCP: 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
‘దానా’ అక్టోబర్ 24న అంటే గురువారం నాడు తీవ్ర తుఫానుగా మారుతుందని, అక్టోబర్ 25 ఉదయం గంటకు 100 నుండి120 కి.మీ వేగంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో తీరాన్ని తాకుతుందని IMD అంచనా వేస్తోంది. అయితే, ఈ సమయంలో గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుఫాను కారణంగా, పూరీలోని వాతావరణ శాఖ మత్స్యకారులను సముద్రానికి దూరంగా ఉండాలని సూచించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయి. మరోవైపు తూఫాను దృష్ట్యా రైల్వేశాఖ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే ఒడిశా, బెంగాల్ మార్గాల్లో డజన్ల కొద్దీ రైళ్లు రద్దు చేయబడ్డాయి. దానా తుఫానుకు సంబంధించి ఎమర్జెన్సీని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఒడిశాకు వందల టన్నుల ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలను పంపింది.