Site icon NTV Telugu

YS Jagan: దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్లుగా ఉంది వీళ్ల వ్యవహారం..

Ys Jagan

Ys Jagan

YS Jagan: మన రాష్ట్ర పురోగతి అట్టడుగున ఉందని..కానీ వృద్ధిరేటులో దూసుకుపోతున్నట్లు చంద్రబాబు చెప్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు.. చంద్రబాబు ఎవరికి చెవిలో పూలు పెడుతున్నారు.. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదోవ పట్టాయన్నారు.. దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్లుగా టీడీపీ నేతల వ్యవహారం ఉందని విమర్శించారు.. వనరులు మొత్తం దోచేస్తున్నారన్నారు.. ఆయనకు ఒక విమానం.. దాంతో ఒక హెలికాఫ్టర్ ఉందని.. లోకేష్, పవన్‌కు కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నారు. కొలంబో వెళ్ళి మ్యాచ్ చూస్తాడు.. తర్వాత రోజు ఉదయాన్నే విజయవాడ వస్తారని విమర్శించారు.. ప్రైవేట్ ఫ్లైట్ కొలంబో వెళ్ళి మ్యాచ్ చూస్తారు.. టీవీలో చూస్తే మ్యాచ్ కనిపించదా?.. నేను కూడా మ్యాచ్ టీవీలోనే చూశానన్నారు. అప్పులపై మళ్ళీ మళ్ళీ గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని.. ఎన్నిసార్లు సాక్ష్యాలు, ఆధారాలు చూపినా అదే అబద్ధాలు ఆడుతున్నారన్నారు.. కుక్క తోక వంకర అన్నట్లుగా చంద్రబాబు వ్యవహారం ఉందని తీవ్రంగా విమర్శించారు.. ప్రజలకు తెలిసిపోతుంది అని బడ్జెట్ పేపర్స్ లో అప్పుల టేబుల్ ఎత్తివేశారన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ ఇతర నివేదికల్లో ఏమీ చేయలేరని తెలిపారు..

READ MORE: IP68 రేటింగ్, 50MP+50MP+50MP కెమెరా సెటప్, గేమింగ్‌కు బెస్ట్ ఆప్షన్‌గా Vivo V70 Elite సిరీస్ లాంచ్.. ధర ఎంతంటే?

ఎవరి హయాంలో ఎంత అప్పు అనేది కాగ్ విడుదల చేసిన లెక్కలు చూసినా కనిపిస్తుందని క్లియర్ గా ఉంటుందని మాజీ సీఎం జగన్ అన్నారు.. 2023-24 కు రాష్ట్రానికి సంబంధించిన అప్పులు మొత్తం రూ. 2, 57, 509 కోట్లు.. చంద్రబాబు దిగితే నాటికి రూ. 3.90 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు.. లెక్కలు ఎంత క్లియర్‌గా ఉన్నా చంద్రబాబు మాత్రం గ్లోబెల్స్ ప్రచారం ఆపరని.. తమకు రూ. 9 లక్షల కోట్లు అప్పులు మిగిల్చి వెళ్లారని ఘోరంగా అబద్ధాలు ఆడుతున్నారన్నారు… ఈ ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో చేసిన అప్పులు రూ. 3.17, 448 కోట్లు అని ఆరోపించారు.. వాస్తవాలు ఆధారాలతో కనిపిస్తున్నా బడ్జెట్ డాక్యుమెంట్స్‌తో గేమ్ ఆడుతూనే ఉంటారన్నారు..

READ MORE: IP68 రేటింగ్, 50MP+50MP+50MP కెమెరా సెటప్, గేమింగ్‌కు బెస్ట్ ఆప్షన్‌గా Vivo V70 Elite సిరీస్ లాంచ్.. ధర ఎంతంటే?

Exit mobile version