Site icon NTV Telugu

Diwali Crackers : మార్కెట్‌లో జగన్‌ ఆటమ్‌ బాంబులు.. మాములుగా ఉండదు..

Jagan Atom Bomb

Jagan Atom Bomb

దేశవ్యాప్తంగా దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే.. సనాతన పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్‌ 25న దీపావళి పండుగను ముందుగా సూచించినా.. అదే రోజున సూర్యగ్రహణం ఉంది. అయితే.. సూర్యగ్రహణం ఉండటంతో దీపావళి పండుగను జరుపుకోవడంలో అయోమయం నెలకొంది. దీపావళి పండుగ అంటేనే.. లక్ష్మీ పూజలు, వ్రతాలు ఎన్నో ఉంటాయి. దీంతో వేదపండితులు అక్టోబర్‌ 24న సోమవారమే దీపావళి పండుగను జరుపుకోవచ్చని స్పష్టత ఇవ్వడంతో అందరూ.. సోమవారమే దివ్య దీప్తుల దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అయితే.. రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా పాక్షికంగానే జరుపుకున్న దీపావళి పండుగను ఈ ఏడాది పూర్తిస్థాయిలో జరుపుకునేందుకు ప్రజలు సైతం సిద్ధంగా ఉన్నారు.

Read Also : Balakrishna: దీపావళి నుంచి బాలయ్య కొత్త అవతారం.. కెరీర్లో తొలిసారి

దీంతో దీపావళి టపాసుల వ్యాపారం జోరందుకుంది. మార్కెట్‌ వెరైటీ టపాసులు అందరినీ ఆకర్షి్స్తున్నాయి. అయితే టపాసుల ధరలు కూడా భారీగానే పెరిగాయి. టపాసుల ధరలు అంటించకుండా పేలుతున్నాయి. అయితే.. ఏపీలో సైతం భారీగా టపాసుల దుకాణాలు వెలిశాయి. అయితే ముఖ్యంగా సీఎం జగన్‌ పేరుతో ఆటమ్‌ బాంబులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే.. తమ నాయకుడి పేరుతో ఉన్న బాంబులను కొనేందుకు వైసీపీ శ్రేణులు ఎగబడుతున్నారు.

Exit mobile version