నూతన సచివాయం ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరు కాకపోవడంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన సూర్యపేట జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి నిరోధకులు అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. అందుకే సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ దూరంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధి నిరోధకులు రానంత మాత్రాన జరిగే నష్టం శూన్యమని, రావడం రాక పోవడం గవర్నర్ విజ్ఞత మీద ఆధార పడి ఉంటుందన్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి గైర్హాజరుతో వారీ నిజ స్వరూపం బయట పడిందని ఆయన మండిపడ్డారు. అభివృద్ధిని అభినందించే గుణం ప్రతిపక్షాలకు లేదని, తెలంగాణా అభివృద్ధిని విపక్షాలు ఇష్టపడడంలేదన్నారు. జరుగుతున్న అభివృద్ధితో అడ్రస్ గల్లంతు అవుతుందన్న బెంగ వారిని వెంటాడుతుందని, ప్రజాక్షేత్రంలో వారికి భంగపాటు తప్పదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణా ప్రజల ఆత్మగౌరవానికి నూతన సచివాలయం ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందిని ఆయన కొనియాడారు.
Also Read : New York: న్యూయార్క్‌లో బైబ్యాక్ కార్యక్రమం.. గిఫ్ట్‌కార్డుల కోసం తుపాకులను వదిలేశారు..
అంతేకాకుండా.. మేడే సందర్భంగా కార్మిక దినోత్సవంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. విశ్వమానవ సౌధానికి కార్మికుల త్యాగలే పునాదులు అని, కోవిడ్-19 లోనూ కార్మికులకు ఆపన్న హస్తం అందించిన నేత అన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోడీ సర్కార్.. గుజరాత్ లో కార్మిక సంఘాల నిషేధమే ఇందుకు నిదర్శనమన్నారు. నిషేధాన్ని వ్యతిరేకిస్తూ మరో పోరాటానికి సన్నద్ధం కావాలని, కార్మికుల ఆత్మగౌరవ భవనాలకు త్వరలోనే శంకుస్థాపన అని ఆయన అన్నారు.
Also Read : YSRCP Vs TDP: రజనీకాంత్ ఏపీకి వచ్చి మాట్లాడారు.. ఆయనపై మీరు తమిళనాడుకు వెళ్లి కామెంట్ చేయగలరా..?
