NTV Telugu Site icon

Jagadish Reddy : ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఆశవాహులకు సముచిత స్థానం దక్కుతుంది

Jagadish Reddy

Jagadish Reddy

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సోమవారం నాడు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఆయన తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌తో పాటు కామారెడ్డి సెగ్మెంట్‌లో కూడా పోటీ చేయనున్నారు. ప్రకటించిన జాబితాలో బోథ్‌, ఖానాపూర్‌, వైరా, కోరుట్ల, ఉప్పల్‌, ఆసిఫాబాద్‌, మెట్‌పల్లి అభ్యర్థుల పేర్లతో కలిపి ఏడు మార్పులు మాత్రమే ఉన్నాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Also Read : Vizag POCSO Court: కన్నకూతురుపై అత్యాచారం, గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు సంచలన తీర్పు

అయితే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ నియోజకవర్గానికి కంచర్ల భూపాల్ రెడ్డిని, మునుగోడుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని, నాగార్జునసాగర్‌కు నోముల భగత్, మిర్యాలగూడకు నల్లమోతు భాస్కరరావును, నకిరేకల్‌కు చిరుమర్తి లింగయ్య, దేవరకొండకు రామావత రవీంద్ర కుమార్‌ను, సూర్యాపేటకు గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని, తుంగతుర్తికి గాదరి కిషోర్ కుమార్‌ను, కోదాడకు బొల్లం మల్లయ్య యాదవ్‌ను, హుజూర్నగర్‌కు శానంపూడి సైదిరెడ్డిని, భువనగిరికి పైళ్ళ శేఖర్ రెడ్డిని, ఆలేరుకు గొంగిడి సునీత రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు సీఎం కేసీఆర్‌.

Also Read :Telangana : హైదరాబాద్ లో దారుణం.. బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్..

ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయించడంతో సూర్యాపేటలో సంబరాలు చేసుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు‌. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో మహిళా నాయకులు సందడి చేసి ఆనందోత్సవాలతో డాన్స్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రగతి నివేదన సభ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మంత్రి జగదీశ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.