Madhyapradesh : మందు కొట్టి మత్తులోకి జారుకున్న టీచర్.. వీడియో తీసి వైరల్ చేసిన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఓ టీచర్ తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో పాఠశాలకు చేరుకున్నాడు. అతని శరీరాన్ని కూడా నియంత్రించలేకపోయాడు. అతి కష్టం మీద స్కూల్ మెట్ల దగ్గరకు చేరుకుని కూర్చుండిపోయాడు. అది చూసిన విద్యార్థులు టీచర్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. జబల్పూర్ జిల్లా బాఘ్‌రాజీ క్లస్టర్‌లోని జమునియా స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వైరల్ అవుతున్న వీడియోలో, ఉపాధ్యాయుడు మద్యం మత్తులో అక్కడక్కడ తిరుగుతూ కనిపించాడు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఉపాధ్యాయుడు రాజేంద్ర నేతం రోజూ మద్యం తాగి పాఠశాలకు వచ్చి అక్కడక్కడ తిరుగుతుంటాడని చెప్పారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు పాఠాలు చెప్పాలంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
Read Also:TG To Replace TS: ఇకపై టీఎస్ స్థానంలో టీజీ.. నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం..!
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సర్పంచ్ కూడా పలుమార్లు ఉపాధ్యాయుడికి వివరించి మద్యం సేవించి పాఠశాలకు రావద్దని సూచించాడు. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. ఇంతకుముందు కూడా ఉపాధ్యాయుడు రాజేంద్ర నేతమ్‌ను ఎక్కడ పోస్ట్ చేసినా, అతను ప్రతిచోటా ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించాడని తోటి ఉపాధ్యాయులు చెప్పారు. చాలా సార్లు పరిస్థితి దిగజారడంతో సాయంత్రం పాఠశాల మూసిన తర్వాత అతడిని ఇంటికి తీసుకెళ్లామని ఉపాధ్యాయులు తెలిపారు.
ఈ పరిస్థితిని గమనించిన గ్రామస్తులు ఈ ఉపాధ్యాయుడిని వెంటనే పాఠశాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జమునియా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. 55 మంది పిల్లలకు ఇక్కడ ప్రవేశం కల్పించారు. ఉపాధ్యాయుడు రాజేంద్ర నేతమ్ మద్యం సేవించి పాఠశాలలో తలదాచుకోవడం, ఇతర ఉపాధ్యాయులు పిల్లలందరికీ ఒకచోట కూర్చొని పాఠాలు చెప్పడం చాలా సార్లు జరుగుతుంది. ఇప్పుడు అతని వీడియో వైరల్ కావడంతో జబల్పూర్ విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ ధర్మేంద్ర ఖరే దీనిపై విచారణకు డీపీసీని ఆదేశించినట్లు చెప్పారు. నివేదిక రాగానే నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also:Megastar Fans: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరు సినీ లైఫ్ జర్నీ వీడియో
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!