Jab Khuli Kitaab: ‘జబ్ ఖులి కితాబ్’ ట్రైలర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) నుంచి మరో ఆసక్తికరమైన ఒరిజినల్ మూవీ ‘జబ్ ఖులి కితాబ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు సౌరభ్ శుక్లా దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే, ఒక పరిణతి చెందిన ప్రేమకథతో పాటు కుటుంబ భావోద్వేగాలను ఎంతో సున్నితంగా చూపించినట్లు అర్థమవుతోంది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ వివాహ బంధం తర్వాత, గోపాల్ (పంకజ్ కపూర్), అనసూయ (డింపుల్ కపాడియా) విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఈ కథలోని అసలు ట్విస్ట్. చావుబతుకుల మధ్య ఉన్న భార్యను ప్రాణంగా చూసుకునే భర్త, అసలు విడాకులు ఎందుకు అడుగుతున్నాడు? అనే ఆసక్తికరమైన అంశంతో ఈ ట్రైలర్ సాగింది.
Also Read : Sivaji Raja: నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం!
Also Read
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్‌పార్క్‌కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
- Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
ఈ సినిమా గురించి పంకజ్ కపూర్ స్పందిస్తూ.. ‘ప్రేమ అనేది వయసుతో మసకబారదని, కాలానికి అనుగుణంగా అది మారుతూ ఉంటుందని ఈ సినిమా చెబుతుంది. సౌరభ్ శుక్లా రాసిన ఈ వాస్తవిక కథలో భాగమవ్వడం గొప్ప అనుభూతి’ అని అన్నారు. అలాగే డింపుల్ కపాడియా మాట్లాడుతూ, అనసూయ పాత్ర తన మనసుకు ఎంతో దగ్గరైందని, తన వైవాహిక బంధం విషయంలో నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించే ఒక ధైర్యవంతురాలైన మహిళగా ఈ పాత్ర కనిపిస్తుందని తెలిపారు. అపరశక్తి ఖురానా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం హాస్యం, భావోద్వేగాల కలయికగా ఉండబోతోంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 6, 2026 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
Shahrukh Khan: చరిత్ర సృష్టించిన ‘షారుఖ్’ నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
-
IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్‌కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..
-
Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్‌పార్క్‌కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
-
Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?