ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు చేస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేలు నాయకులకు గుబులు పుట్టిస్తున్నాయి. స్థాన బదిలీలు, కొత్త కొత్త అభ్యర్థుల పేర్ల పరిశీలనతో జరుగుతున్న సర్వేల నేపథ్యంలో పల్నాడు టీడీపీ క్యాడర్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పల్నాడు జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గంతో పాటు, నరసరావుపేట, గురజాల అసెంబ్లీ స్థానాలకు కొత్త అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించింది టీడీపీ అధిష్టానం. ఇక్కడ సీనియర్ నాయకులు పేర్లను అభ్యర్థులుగా పెట్టబోతున్నాం అని సర్వేల ద్వారా పరిశీలిస్తుంది టీడీపీ.
Read Also: Pankaj Udhas: ప్రముఖ గజల్ గాయకులు పంకజ్ ఉదాస్ కన్నుమూత..
ఇదిలా ఉంటే.. నరసరావు పేట ఎంపీ అభ్యర్థిగా కృష్ణ దేవ రాయలు పేరును ఐవీఆర్ఎస్ సర్వేలో టీడీపీ అధిష్టానం సూచిస్తుంది. నరసరావు పేట అసెంబ్లీ అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు పేరును పరిశీలిస్తోంది. గురజాల అభ్యర్థిగా బీసీ నేత జంగా కృష్ణమూర్తి పేరును పరిశీలిస్తోంది. ఇక గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తారని సర్వే జరుగుతుంది. ఈ సర్వేలపై మాట్లాడానికి నాయకులు ఏ మాత్రం సుముఖంగా లేరని చెబుతున్నారు. అధిష్టానం నిర్ణయం మేరకే కట్టుబడి ఉంటామని అంటున్నారు. ఈ సర్వేలపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుపుతున్నారు.
Read Also: Congress: హస్తానికి మాజీ సీఎం భార్య ఝలక్.. బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎంపీ