NTV Telugu Site icon

iVoomi: ఫెస్టివల్ స్పెషల్.. ఈ ఈవీ పై భారీ తగ్గింపు.. ..!

Ivoomi

Ivoomi

ఎలక్ట్రిక్ టూ-వీలర్ iVoomi.. తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.10,000 వరకు తగ్గింపును ప్రకటించింది. టాప్ మోడల్ iVoomi జీట్ఎక్స్ ze పై రూ. 10,000, iVoomi S1 మోడల్ పై రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా.. 0 శాతం వడ్డీతో జీరో డౌన్‌పేమెంట్ లోన్‌లు, రూ. 1,411 నుండి నెలవారీ వాయిదాలతో ఆకర్షణీయమైన ఆఫర్‌లను తీసుకొచ్చింది.

Read Also: BCB: బంగ్లాదేశ్ క్రికెట్‌లో రచ్చ.. హెడ్ కోచ్ హతురుసింగ సస్పెండ్

iVoomi JeetX 10,000 వరకు భారీగా ధర తగ్గించడంతో.. ఇప్పుడు దీని రిటైల్ ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 65kmph వేగంతో వస్తుంది. అంతేకాకుండా.. 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే.. iVoomi S1రూ. 5,000 తగ్గింపుతో రూ. 79,999 (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ గరిష్టంగా 57kmph వేగంతో 120 km పరిధిని అందిస్తుంది. ఈ బైక్ ను రెండు గంటల్లో 0-50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

Read Also: Axis Bank: స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌ పేరుతో మోసం.. రూ.97 కోట్లు నొక్కేసిన మేనేజర్ బృందం

iVoomi S12.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 5,000 తగ్గింపు లభిస్తుంది. రిటైల్ ధర రూ. 82,999 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110కిమీ పరిధిని అందిస్తుంది. ఇది 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్‌కు రూ. 2,999 ప్రీమియంతో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో సహా క్లౌడ్-కనెక్ట్ చేసిన సేవలతో ఈ-స్కూటర్‌లను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని ప్రస్తుత కస్టమర్‌లు ప్రవేశపెట్టారు. ఈ కంపెనీ (iVOOMi) సీఈవో అశ్విన్ భండారి మాట్లాడుతూ.. “పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఆకర్షణీయమైన తగ్గింపులు, ఫైనాన్సింగ్ ఆప్షన్‌లతో భవిష్యత్ మొబిలిటీని అనుభవించడాన్ని మా కస్టమర్‌లకు మరింత సులభతరం చేయడానికి మేము సంతోషిస్తున్నాము.” అని తెలిపారు.

Show comments