Ivana trump Bunglow : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ ఆగస్టులో కన్నుమూశారు. అప్పట్లో ఆమె మరణానికి కారణాలను వెల్లడించలేదు. అపార్ట్ మెంట్లో ఆమె మెట్లపైనుంచి పడిపోవడం వల్లే చనిపోయినట్లు న్యూయార్క్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇవానా చనిపోవడంపై ఎటువంటి అనుమానాలు లేవని ఆమె కుటుంబసభ్యులు కూడా పేర్కొన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆమె నివసించిన భవంతిని అమ్మకానికి పెట్టారు. బ్రోకింగ్ సంస్థ ఈ బంగ్లా ధరను దాదాపు రూ.215కోట్లుగా నిర్ణయించింది. మాన్ హట్టన్ లో నిర్మించిన ఈ బంగ్లా 8,725 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. 64 వ వీధిలో నిర్మించిన ఈ బంగ్లాలో 5 బెడ్‌రూమ్‌లు, 5 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. భవంతి 1980 నాటి ఇంటీరియర్‌ను కలిగి ఉన్నది.
Read Also : Elon Musk: నాకు ఏ బాధ్యతలు వద్దు.. త్వరలోనే వెళ్లిపోతా
ఇవానాతో డొనాల్డ్ ట్రంపుకు 1977లో పెళ్లైంది. వీరికి ముగ్గురు సంతానం. డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, డొనాల్డ్ ట్రంప్ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగే క్రమంలో ఇవానా కీలకంగా వ్యవహరించారు. ఈ భవంతి అమ్మితే వచ్చే ఆదాయాన్ని ఇవానా-డొనాల్డ్ ట్రంప్ ముగ్గురు పిల్లలు పంచుకోనున్నారు. ఇవానా 1992లో రూ.20 కోట్లకే ఈ బంగ్లాను కొనుగోలు చేసింది. అదే సంవత్సరంలో ఆమె డొనాల్డ్ ట్రంప్ నుంచి విడాకులు తీసుకున్నది. కాగా, 2022లో ఇవానా ట్రంప్ తన బంగ్లాలో శవమై కనిపించింది. 73 ఏండ్ల ఇవానా మాన్‌హాటన్ అపార్ట్‌మెంట్ మెట్ల పైనుంచి పడిపోవడంతో ఇవానా మరణించింది. చెకొస్లోవేకియాలో పుట్టిన ఇవానా.. ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చింది. అమెరికాలో చదువుతూనే మోడలింగ్ చేసింది. ఇదేసమయంలో వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు 1977 లో పెండ్లి చేసుకున్నారు. 15 ఏండ్లపాటు వైవాహిక జీవితాన్ని కొనసాగించిన వీరు 1992 లో విడిపోయారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వ్యాపార సామ్రాజ్యానికి చిహ్నంగా మారిన ట్రంప్ టవర్స్ నిర్మాణంలోను ఇవానా వెన్నంటే ఉండి కీలకంగా వ్యవహరించారు. వీరి విడాకుల అనంతరం మెలానియా ట్రంప్ ను 2005లో డొనాల్డ్ ట్రంప్ రెండో పెళ్లి చేసుకున్నాడు.