IT Raids On Restaurants: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చేపట్టిన దాడులు, విచారణలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. నవంబర్ 18న ప్రారంభమైన ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్ (Pista House), షాగౌస్ (Shah Ghouse), మేహ్ ఫిల్ (Mehfil) వంటి ప్రముఖ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు భారీ మొత్తంలో లెక్కలో లేని నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను గుర్తించినట్లు సమాచారం.
World’s Best Cities: 2025లో ప్రపంచంలోని ఉత్తమ నగరాలు లిస్ట్.. భారత్ నుండి మూడు నగరాలకు చోటు..!
తాజా పరిణామాలలో భాగంగా.. వుడ్బ్రిడ్జ్ (Wood Bridge) హోటల్ యజమాని, బీఆర్ఎస్ నాయకుడు అయిన హర్షద్ అలీ ఖాన్ ను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు (డిసెంబర్ 2) ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి, అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. హర్షద్ అలీ ఖాన్ను విచారించిన ఐటీ అధికారులు, గతంలో దాడులు జరిగిన పిస్తా హౌస్ తోపాటు ఇతర హోటళ్లు, రెస్టారెంట్లతో ఆయనకు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ హోటళ్లకు పరస్పరం లింకులు ఉన్నాయనే అనుమానంతో ఐటీ అధికారులు వారిపై కూడా దృష్టి సారించారు.
Hyderabad Road Accident: నగరంలో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి..!
నవంబర్ 18న పిస్తా హౌస్ యజమానులు మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ల ఇళ్లల్లో కూడా సోదాలు జరిగాయి. ప్రతి ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్న ఈ హోటళ్లు రికార్డుల్లో చూపిన ఆదాయానికి, నిజమైన ఆదాయానికి మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. పన్ను చెల్లింపులో వ్యత్యాసంతో పాటు.. అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఐటీ దాడులు ముమ్మరం అయ్యాయి. ఈ దాడుల్లో లభించిన అక్రమ ఆస్తులు, నగదు వివరాలను ఐటీ అధికారులు త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.