Site icon NTV Telugu

IT Raids : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

It Raids

It Raids

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 35 గంటలుగా సుదీర్ఘంగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా కొనసాగుతున్న సోదాల్లో విదేశీ కంపెనీ, బ్యాంక్ లావాదేవీలు పై ఐటీ ఆరా తీస్తున్నారు అధికారులు. ఇప్పటికే భారీగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేరుకున్నారు. ఎమ్మెల్యేల సతీమణుల డైరెక్టర్ల కంపెనీలుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, లాకర్లు వివరాలు సేకరించిన ఐటీ అధికారులు.. పలు పత్రాలు ముందుంచి, ఆదాయ, పన్నుల చెల్లింపు వ్యత్యాసాలు పై ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతుండడం తో ఉత్కంఠ పెరుగుతోంది.

Also Read : KS Bharat: సీఎం జగన్‌తో కేఎస్ భరత్ భేటీ.. ఏపీలో స్పోర్ట్స్ ప్రమోషన్ బాగుందన్న క్రికెటర్

మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేటలోని కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి జనార్థన్ రెడ్డి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులోని పైపుల తయారీ పరిశ్రమ కూడా జనార్దన్‌రెడ్డిదేనన్న అనుమానంతో అధికారులు అక్కడా కూడా తనిఖీలు చేస్తున్నారు.

Also Read : Manipur Violence: మణిపూర్‌లో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం పొడిగింపు

Exit mobile version