NTV Telugu Site icon

Manjummel Boys : మంజుమ్మెల్‌ బాయ్స్ పన్ను ఎగవేత స్కాం.. ఇంతకీ ఏమైందంటే ?

Manjummel Boys

Manjummel Boys

Manjummel Boys : ఈ ఏడాది ఆరంభంలో మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది ‘మంజుమ్మల్ బాయ్స్’. వరల్డ్ వైడ్ ఈ సినిమా దాదాపుగా రూ.250 కోట్ల వసూళ్లు నమోదు చేసిందంటూ మాలీవుడ్ బాక్సాఫీసు వర్గాల సమాచారం. సినిమాకు పెట్టిన పెట్టుబడికి దాదాపు పది రెట్లు లాభాలు వచ్చినట్లుగా టాక్‌ వినిపించింది. సినిమా విడుదల అయిన తర్వాత ఒక్కొక్కటిగా వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి ఈ సినిమా నిర్మాణంలో తాను భాగస్వామినే అంటూ, కానీ తనకు రావాల్సిన లాభాల వాటాను ఇవ్వడం లేదని కోర్టును ఆశ్రయించాడు.

Read Also:AP Capital Region: రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు.. ఎవరికి ఎంతంటే..?

ఈ సినిమా నిర్మాతల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేరళ అరూర్‌కు చెందిన సిరాజ్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై గతంలో ఎర్నాకులం సబ్‌ కోర్టు ఈ తీర్పునిచ్చింది. తాను సినిమా కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా డివిడెండ్, పెట్టుబడి కూడా ఇవ్వలేదని సిరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సబ్ కోర్టు జడ్జి సునీల్ వర్కి ఈ స్పీమా నిర్మాణ సంస్థ పరవ ఫిల్మ్స్, దాని భాగస్వామి షాన్ ఆంటోనీ 40 కోట్ల విలువైన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేశారు. సిరాజ్ వలియతార హమీద్ దాఖలు చేసిన పిటిషన్‌లో.. సినిమా నిర్మాణానికి 7 కోట్లు ఖర్చు చేశారన్నారు. నిర్మాతలు 40 శాతం లాభాల వాటా ఇస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్నారని, ఆపై లాభం లేదా పెట్టుబడి చెల్లించకుండా మోసం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Read Also:Adibatla : వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం.. లేడీ వాయిస్‌తో ట్రాప్..!

మంజుమ్మెల్‌ బాయ్స్ ప్రొడ్యూసర్లకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా గురించిన వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు నిర్మాతలు మినిమం ట్యాక్స్ సైతం చెల్లించలేదంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా చిత్ర నిర్మాత ఆఫీస్‌లపై ఐటీ అధికారులు దాడులు చేసింది. కేరళలోని కొచ్చిలో ఉన్న ఈ సినిమా నిర్మాణ సంస్థ ఆఫీస్‌పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్లుగా మలయాళ మీడియాలో వార్త కథనాలు వినిపిస్తున్నాయి. నిర్మాతల ఆఫీస్‌లను తనికీలు చేసిన ఐటీ అధికారులు ఏం గుర్తించారు అనే విషయమై అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ నిర్మాతలు పెద్ద మొత్తంలో పన్ను ఎగవేశారంటూ ఐటీ అధికారులు గుర్తించారని వార్తలు వినిపిస్తున్నాయి.