Aditya L-1 Mission: సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో రెడీ.. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aditya L-1 Mission: చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడంతో ఇస్రో ఉత్సాహంగా ఉంది. చంద్రుడిపై సక్సెస్ సాధించిన ఇస్రో ఇప్పుడు సూర్యుని గురించి అధ్యయనం చేయడానికి ఒక వారంలోపు సోలార్ మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.ఇస్రో సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్‌ను ప్రారంభించనుంది. సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపడుతోంది. దీనిని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్ పాయింట్-1 (L-1)దగ్గర ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. 177 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్-1 ఈ కక్ష్యలోకి చేరుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, సౌర తుఫానులపై అధ్యయనం చేయవచ్చు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు ఒక అంచనా వేశారు. దీంతోపాటు కాంతిమండలం(ఫొటోస్పియర్),వర్ణ మండలం(క్రోమోస్పియర్)పై అధ్యయనం చేసి సమాచరాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు.
Read Also: Russia: రష్యా విమానం ప్రమాదం.. 10 మృతదేహాలు, ఫ్లైట్ రికార్డర్లు వెలికితీత
Also Read
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 శ్రీహరికోట స్పేస్‌పోర్ట్‌లో ఉందని ఇస్రో పేర్కొంది. అన్నీ సవ్యంగా సాగితే సెప్టెంబర్ మొదటి వారంలో ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. ఈ మిషన్ తర్వాత, సూర్యుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన ప్రపంచంలో నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. గతంలో అమెరికా, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యునిపైకి ఉపగ్రహాలను పంపాయి. ఆదిత్య ఎల్-1 సిద్ధమైందని, ప్రయోగానికి సిద్ధంగా ఉందని అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1ను మోసుకుంటూ పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను నీలేశ్ ఎం దేశాయ్ వివరించారు.
సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత్ పంపిస్తున్న తొలి అబ్జర్వేటరీ స్పేస్‌క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం. దీని ద్వారా సూర్య వ్యవస్థ గురించి ముఖ్యమైన వివరాలు తెలుస్తాయి. ఇందులో మొత్తం ఏడు పే లోడ్లు ఉంటాయి. వీటిలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ పేలోడ్ ద్వారా సూర్యుడి చిత్రాలు, స్పెక్ట్రోస్కోపిపై దృష్టి సారించవచ్చు. దీని ద్వారా సూర్యుడికి ఎక్కడి నుంచి శక్తి లభిస్తుందో మరింతగా తెలుసుకోవచ్చు.
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!