NTV Telugu Site icon

SSLV D3 Rocket: రేపు నింగిలోకి SSLV D3 రాకెట్.. కౌంట్ డౌన్ మొదలు

Isro

Isro

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష రంగంలో మరో పెద్ద ముందడుగు వేయనుంది. SSLV D3 రాకెట్ ప్రయోగానికి రేపు తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు కౌంట్ డౌన్ షురూ కానుంది. ఆరున్నర గంటల పాటు కౌంటర్ ప్రక్రియ కొనసాగనుంది. రేపు ఉదయం 9 గంటల 17 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది. చెన్నైకి చెందిన స్టార్టప్ స్పేస్ రిక్షా యొక్క 175 కిలోల ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం EOS-8 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెడతారు.

Minister Farooq: మత సంస్థల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తగదు..

EOS-8 ఉపగ్రహం కొత్త, భవిష్యత్తు సాంకేతికతలతో నిండి ఉందని.. ఇది ఇస్రో, భారతదేశ ప్రజల కలలకు శక్తినిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉపగ్రహంలోని ఒక ప్రత్యేక పరికరం అతినీలలోహిత (UV) కాంతికి గురికావడాన్ని కొలుస్తుంది. ఇది గగన్‌యాన్ మిషన్‌కు కూడా ఉపయోగపడుతుంది. ఈ పరికరం మిషన్ సమయంలో వ్యోమగాములు అతినీలలోహిత కాంతికి గురికావడాన్ని కొలుస్తుంది.

Ward Boy: వైద్యుడికి బదులు వార్డ్బాయ్ ఆపరేషన్.. వీడియో తీసి..!

ఈ ఉపగ్రహాన్ని SSLV రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. అయితే.. 2022లో SSLV మొదటి ప్రయోగం విజయవంతం కాలేదు. ఆ తర్వాత.. 10 ఫిబ్రవరి 2023న రెండవ ప్రయోగం విజయవంతం కాగా.. ఈసారి మూడో ప్రయోగం జరుగనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఎస్‌ఎస్‌ఎల్‌విని వాణిజ్యపరంగా మరింత మెరుగైన రీతిలో ఉపయోగించుకోవచ్చని ఇస్రో భావిస్తోంది. కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో.. రాకెట్లను ప్రయోగిస్తూ అంతరిక్షరంగంలో వరుసగా విజయాలు సాధిస్తోంది.