LVM-3 M6: నింగిలోకి బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం.. మారనున్న మొబైల్ నెట్‌వర్క్ టెక్నాలజీ..
- భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి
- నింగిలోకి బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం దూసుకెళ్లింది
- ఇస్రో తొలిసారి భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది
- బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం బరువు 6,100 కేజీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి. బుధవారం ఉదయం 8:55 గంటలకు తన అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM3 ద్వారా US కంపెనీ AST స్పేస్‌మొబైల్ నుండి బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. నింగిలోకి బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం దూసుకెళ్లింది. ఇస్రో తొలిసారి భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహంను రూపొందించిన అమెరికా AST స్పేస్ మొబైల్ కంపెనీ.. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం బరువు 6,100 కేజీలు. ఈ రోజు ఉదయం గం 8.55 ని శ్రీహరికోట నుంచి LVM3-M6 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. లాంచ్ వెహికల్ మార్క్ 3 (LVM3) భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాకెట్, అందుకే దీనిని బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తారు.
Also Read:Marvel Studios : ‘Avengers: Doomsday’ టీజర్.. కెప్టెన్ అమెరికా తిరిగొచ్చాడు
Also Read
- PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్‌గా మారింది
- Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
- PM Modi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రతిధ్వని ప్రపంచానికి వినిపించింది.. మెల్బోర్న్లో మోడీ కామెంట్స్..
- Pakistan: లిబియాలో శాంతి దూతగా పాక్.. యూఎస్-ఇరాన్ తర్వాత కొత్త మిషన్.. అసలు కారణం వేరే..
ప్రయోగించిన 15 నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్-2 రాకెట్ నుండి విడిపోతుందని భావిస్తున్నారు. 6,100 కిలోల ఉపగ్రహం LVM3 రాకెట్ ద్వారా తక్కువ భూమి కక్ష్య (LEO)లోకి ప్రవేశపెట్టబడిన అత్యంత బరువైన పేలోడ్ అవుతుందని ఇస్రో తెలిపింది. మునుపటి అత్యంత బరువైన పేలోడ్ LVM-3-M5 కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03, దీనిని నవంబర్ 2న ఇస్రో ప్రయోగించింది. బ్లూబర్డ్ బ్లాక్-2 ప్రయోగాన్ని ఇస్రో వాణిజ్య విభాగం, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) నిర్వహిస్తుంది.
Also Read:OTT Piracy : ఓటీటీల చేతకానితనమే పైరసీకి వరమా?
మొబైల్ నెట్‌వర్క్ టెక్నాలజీ మారనుంది
ఈ మిషన్‌ను న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) (ఇస్రో వాణిజ్య విభాగం), అమెరికాకు చెందిన AST స్పేస్‌మొబైల్ (AST & సైన్స్, LLC) మధ్య వాణిజ్య ఒప్పందం ప్రకారం నిర్వహిస్తున్నారు. ఈ ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా హై-స్పీడ్ సెల్యులార్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడానికి రూపొందించారు. ఇది మొబైల్ కనెక్టివిటీ కోసం ప్రపంచ LEO కాన్స్టెలేషన్‌లో భాగం అవుతుంది. AST స్పేస్‌మొబైల్ మొట్టమొదటి స్పేస్-ఆధారిత సెల్యులార్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది స్మార్ట్‌ఫోన్‌లను వాణిజ్య, ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఉపగ్రహాలకు నేరుగా కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ నెట్‌వర్క్ ప్రపంచంలో ఎక్కడైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజింగ్, స్ట్రీమింగ్, డేటా సేవలకు మద్దతు ఇస్తుంది .
తాజావార్తలు
-
PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్‌గా మారింది
-
Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
-
PM Modi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రతిధ్వని ప్రపంచానికి వినిపించింది.. మెల్బోర్న్లో మోడీ కామెంట్స్..
-
Harish Rao : సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం నీళ్లను చూడండి.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్
-
Mittapalli Surendar: ఎంత డబ్బు ఇచ్చినా ఐటమ్ సాంగ్స్ రాయను
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!