NTV Telugu Site icon

ISRO: ఇంటెలిజెన్స్ సేకరణ కోసం వచ్చే ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగిస్తాం..

Isro

Isro

Somanath: రానున్న కాలంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష రంగంలో భారత్‌ను ప్రధాన శక్తిగా మార్చడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. జియో ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించేందుకు వచ్చే ఐదేళ్లలో భారత్ 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. భద్రతా దళాల కదలికలను పర్యవేక్షించే సామర్థ్యంతో పాటు వేలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఛాయా చిత్రాలను తీయగల సామర్థ్యంతో వివిధ కక్ష్యలలో ఉపగ్రహాలను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Read Also: Devil Movie OTT: ‘డెవిల్’ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్..!!

ఇక, బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) వార్షిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెంట్ టెక్‌ఫెస్ట్‌లో సోమ్‌నాథ్ మాట్లాడుతూ.. మార్పు గుర్తింపు, డేటా విశ్లేషణ, ఏఐ- సంబంధిత డేటా ఆధారిత ప్రయత్నాల పరంగా ఉపగ్రహాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యమని చెప్పారు. భారతదేశం బలమైన దేశంగా ఎదగాలన్న ఆకాంక్షను సాకారం చేసుకోవడానికి.. ప్రస్తుతం ఉన్న ఉపగ్రహ నౌకల పరిమాణం సరిపోదని.. అది ఈ రోజు ఉన్న దానికంటే 10 రెట్లు అవసరమని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. దేశ సరిహద్దులు, పొరుగు ప్రాంతాలపై నిఘా ఉంచే సామర్థ్యం ఈ వ్యోమనౌకకు ఉందన్నారు. ఇదంతా శాటిలైట్ల ద్వారా చూడవచ్చని సోమ్‌నాథ్ అన్నారు. అ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాము.. కానీ, ఇప్పుడు భిన్నమైన ఆలోచనా విధానం ఉంది అని ఆయన చెప్పారు.

Read Also: Himanta Biswa Sarma : వివాదాల్లో చిక్కుకున్న సీఎం.. ‘బ్రాహ్మణ-శూద్ర’ పోస్ట్‌ను తొలగింపు

అయితే, ఏదైనా దేశం యొక్క బలం దాని చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగల సామర్థ్యమేనని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్ నాథ్ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో పూర్తి చేసేందుకు 50 ఉపగ్రహాలను సమీకరించామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రత్యేక జియో-ఇంటెలిజెన్స్ సేకరణలో సహకరించేందుకు భారత్‌కు పంపుతున్నామని ఆయన అన్నారు. భారత్ ఈ స్థాయిలో ఉపగ్రహాలను ప్రయోగించగలిగితే దేశం ఎదుర్కొంటున్న ముప్పులను మరింత మెరుగైన రీతిలో తగ్గించవచ్చని సోమనాథ్ చెప్పారు.