NTV Telugu Site icon

Isro Chairman Somnath: ఈ నెలలోనే పీఎస్‌ఎల్‌వీ సీ-60 రాకెట్ ప్రయోగం

Isro Chairman

Isro Chairman

Isro Chairman Somnath: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నేడు సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 మిషన్‌ను ప్రయోగిస్తున్నారు. నింగిలోకి 2 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉపగ్రహాలు వెళ్లనున్నాయి. పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ సూళ్లూరుపేటలోని చంగాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ పూజలు చేశారు.

Read Also: MLC By Election: రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

రాకెట్ ప్రయోగ కౌంట్‌డౌన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ పేర్కొన్నారు. సూర్యునిపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టడమే ఈ ఉపగ్రహ ప్రధాన ఉద్దేశమని ఆయన వెల్లడించారు. PSLV C- 60 రాకెట్‌ను కూడా ఈ నెలలోనే ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. చంద్రయాన్-4 రాకెట్ ప్రయోగం కోసం సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. గగన్‌యాన్ రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు ఈ నెలలో ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌లో మొదలవుతాయని ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ స్పష్టం చేశారు.

Show comments