Site icon NTV Telugu

ISRO Chairman: అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపడతాం!

Isro Chairman

Isro Chairman

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ డా.నారాయణన్ దర్శించుకున్నారు. శ్రీహరికోటలో బుధవారం ప్రయోగించే జీఎస్ఎల్వీ ఏఫ్-15 శాటిలైట్‌ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కౌంట్‌డౌన్ ప్రక్రియ సవ్యంగా సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో శుక్రగ్రహం (వీనస్ గ్రహం)పై పరిశోధనలు చేపడతాం అని తెలిపారు. శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, అతి త్వరలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపడతాం అని పేర్కొన్నారు.

‘రేపు ఉదయం షార్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ నుండి జీఎస్ఎల్వీ ఏఫ్-15 రాకెట్‌ను ప్రయోగిస్తాం. ప్రస్తుతం కౌంట్‌డౌన్ ప్రక్రియ సవ్యంగా సాగుతోంది. 2024లో కంటే ఈ ఏడాది రాకెట్ ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాదిలో గగన్‌యాన్‌.. చంద్రయాన్-4, జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీతో పాటూ మరో రెండు ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు చేపడతాం. రాబోయే రోజుల్లో శుక్రగ్రహంపై పరిశోధనలు చేపడతాం. శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. 1979లో శ్రీహరికోట నుంచి ఎస్ఎల్వీ ఈ1 ద్వారా మొట్ట మొదటి రాకెట్ ప్రయోగం చేపట్టాం. రేపు శ్రీహరికోట నుంచి వందో ప్రయోగాన్ని ఇస్రో చేపట్టబోతోంది. ఈ ప్రయోగంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దేశీయ నావిగేషన్ వ్యవస్థకు సంబంధించి ఇప్పటికే ఐదు ఉపగ్రహాలను పంపాము. మరో మూడు, నాలుగు నావిగేషన్ ఉపగ్రహాలను పంపుతాం. ఈ ఏడాది మరో రెండు డాకింగ్ ఉపగ్రహాలను పంపుతాం. అతి త్వరలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపడతాం’ అని ఇస్రో చైర్మన్ చెప్పారు.

Exit mobile version