తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ డా.నారాయణన్ దర్శించుకున్నారు. శ్రీహరికోటలో బుధవారం ప్రయోగించే జీఎస్ఎల్వీ ఏఫ్-15 శాటిలైట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కౌంట్‌డౌన్ ప్రక్రియ సవ్యంగా సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో శుక్రగ్రహం (వీనస్ గ్రహం)పై పరిశోధనలు చేపడతాం అని తెలిపారు. శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, అతి త్వరలో అంతరిక్షంలో స్పేస్…