NTV Telugu Site icon

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగానికి శరవేగంగా ఏర్పాట్లు.. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు ఇస్రో సన్నద్ధం..!

Chandrayan3

Chandrayan3

ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల వ్యవధిలోనే కీలక ఘట్టం అవిష్కృతం కాబోతుంది. అది కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగం చేపట్టనుంది. రికార్డు స్థాయి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశ పెడుతూ ప్రపంచ దేశాలను ఇస్రో ఆకట్టుకుంటుంది. చంద్రుడి పై మరిన్ని పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. అత్యాధునిక టెక్నాలజీతో జులై రెండవ వారంలో LVM-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఇస్రో హెడ్ క్వార్టర్ అయిన బెంగుళూరులో శాటిలైట్ అనుసంధాన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తయితే చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జూలై 12న ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read Also: Coriander Leaves: ఇలా చేస్తే కొత్తిమీర 15 రోజుల దాకా తాజాగా ఉంటుంది

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుని పై పరిశోధనలు చేసేందుకు మొట్టమొదటిసారిగా 2008 అక్టోబర్ 24వ తేదీన రూ.380 కోట్ల ఖర్చుతో ఇస్రో ఫస్ట్ టైం చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టి నీటి జాడలు ఉన్నాయని కనుగొని భారత జెండాను నాటి ఇస్రో సత్తా చాటుకుంది. అయితే చంద్రుని కక్షపై మరింతగా అన్వేషణలు చేపట్టాలని ఇస్రో 2019 జూలై 22న జీఎస్ఎల్వీ మార్క్..3 రాకెట్ ప్రయోగం ద్వారా చంద్రుని పై రెండోసారి ప్రయోగం చేపట్టి ఆర్బిటర్ సహాయం ద్వారా చంద్రుని కక్షలోకి ప్రవేశపెట్టి అక్కడ నుంచి ల్యాండర్ ను చంద్రగ్రహణం పైకి దింపి ల్యాండర్ నుంచి రోవర్ను చంద్రునిపై దింపి 14 రోజులు పాటు అన్వేషణలు చేసి చంద్రుని ఉపరితలంపై ఏఏ నిక్షేపాలు, ఖనిజాలు, ఎలాంటి వనరులు ఉన్నాయో అనేది కనుగోనేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు.

Read Also: Vande Bharat Express: మరోసారి వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. ఏడాదిలో 7వ సంఘటన

ఇస్రో చంద్రయాన్..2 ప్రయోగం చేసిన అయితే ఈ ప్రయోగం ద్వారా లునార్ ఆర్బిటర్ సహాయంతో చంద్రుని కక్షలో చేరాక ఇస్రో శాస్త్రవేత్తలు ప్లాన్ ప్రకారమే ఆర్బిటర్ చంద్రుని పై నుంచి ల్యాండర్ విడిపోయాయి.. ఆ తర్వాత ల్యాండర్ చంద్రుడుపై కక్ష నుంచి చంద్రుడు ఉపరితలం పైకి ప్రయాణం కొనసాగించింది. ల్యాండ్ చంద్రుడు ఉపరితలంపై నుంచి రెండు కిలోమీటర్లు ఎత్తులో ఉండగానే భూమితో సంబంధాలు తేగిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలకు నిరాశ మిగిలింది. అయితే చంద్రయాన్ 2 ప్రయోగం 90శాతం మేర విజయం సాధించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Read Also: Karnataka: కర్ణాటకలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు.. 26మంది ఆఫ్రికన్ మహిళలు అరెస్ట్

ఈ నేపథ్యంలోనే చంద్రునిపై నిక్షేపాలును కనుగొనాలని ఇస్రో మరింతగా అన్వేషణ జరపాలని చంద్రయాన్ 3 ప్రయోగాన్ని 2023 జూలైలో కానీ ఆగస్టు నెలలో జీఎస్‌ఎల్‌వి మార్క్ 3 రాకెట్ ప్రయోగం ద్వారా ప్రయోగం చేపట్టాలని ఇస్రో శ్రీకారం చుట్టింది. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ప్రయోగాలలో ఏయే సాంకేతిక లోపాలు తలెత్యాయో వాటిని సున్నితంగా పరిశీలించింది. గతంలో తలెత్తిన సాంకేతిక లోపాలపై వివిధ రకాల పరిశోధనలు చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు.. ఇప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టింది.

Show comments