NTV Telugu Site icon

Priyanka Gandhi: గాజాపై ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన ప్రియాంక గాంధీ..

Priyanaka Gandhi

Priyanaka Gandhi

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అనాగరికంగా అభివర్ణించారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను జాతి నిర్మూలన చర్య అని తెలిపారు. ఇజ్రాయెల్ అనాగరికతకు అనేక పాశ్చాత్య దేశాలు మద్దతు పలకడం సిగ్గుచేటని ప్రియాంక ఆరోపించారు. గాజాలో కొనసాగుతున్న సైనిక చర్యను ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాలని ఆమె కోరారు. గాజాలో ప్రతిరోజూ అమాయక పిల్లలు, మహిళలు, వృద్ధులు, వైద్యులు, జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారని ప్రియాంక తెలిపారు.

Blue Light: మీ ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి మీ చర్మానికి హాని కలిగిస్తుంది..

ప్రియాంక గాంధీ.. సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై మండిపడ్డారు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం యుఎస్ కాంగ్రెస్ ఉమ్మడి సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగించిన అనంతరం ఉభయ సభల ఎంపీలు లేచి నిలబడి ఆయనకు చప్పట్లు కొట్టారు. అదే సమయంలో.. కొందరు నాయకులు ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ఈ క్రమంలో.. అమెరికా నేతల తీరుపై ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మానవత్వం, నాగరికతపై నమ్మకం ఉన్నవారు ఇలా చేసి ఉండరని అమెరికా నేతలను ఉద్దేశించి దుయ్యబట్టారు.

Zakia Khanam: వైసీపీకి మరో బిగ్‌ షాక్‌..! లోకేష్‌ను కలిసిన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్
ఇంతకుముందు కూడా.. ప్రియాంక గాంధీ ఇజ్రాయెల్-హమాస్‌పై స్పందించారు. ఇదిలా ఉంటే.. యుద్ధం కారణంగా ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది. ఇజ్రాయెల్, హమాస్ గురించి ప్రపంచం రెండు భాగాలుగా విభజించబడింది. ఒకవైపు చాలా పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తుండగా, మరోవైపు మధ్య ఆసియాలోని ఇరాన్ వంటి దేశాలు పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నాయి. ఈ యుద్ధంలో గాజా ప్రజలు అతిపెద్ద మూల్యాన్ని చెల్లిస్తున్నారు. గాజాలోని వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిరంతరం సైనిక చర్య తీసుకుంటోంది. ఈ సైనిక చర్యలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. ప్రతిరోజూ గాజా నుండి చిన్న పిల్లల మరణ చిత్రాలు వెలువడుతున్నాయి. ఇది ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్ నిర్మూలన వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టంగా చెప్పారు.