NTV Telugu Site icon

Elon Musk: ఎలాన్ మస్క్‌తో ఇజ్రాయెల్‌ అధ్యక్షుడి చర్చలు.. ఎందుకంటే?

Elon Musk Isaac Herzog

Elon Musk Isaac Herzog

ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ పోరు నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ క్రమంలో మిలిటెంట్‌ చెరలోని తమ బందీలను విడిపించేందుకు టెల్‌అవీవ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కొత్తగా రూపొందించిన ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE)ని పర్యవేక్షించడానికి ఎలాన్ మస్క్‌ని నియమించారు. ఈ నేపథ్యంలో బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ మస్క్ ఫోన్‌లో చర్చలు జరిపినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.

READ MORE; Sai Kiran : ‘నువ్వే కావాలి’ అంటూ నటిని పెళ్లాడనున్న సీరియల్ నటుడు

ఈ వారం ప్రారంభంలో మస్క్‌కు ఐజాక్‌ ఫోన్‌ చేసినట్లు సమాచారం. గాజాలో హమాస్ మిలిటెంట్ల చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి చర్చలను తిరిగి ప్రారంభించడం గురించి చర్చించారు. బందీలుగా ఉన్న కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకే ఐజాక్‌ మస్క్‌తో ముచ్చటించినట్లు వెల్లడించారు. కాగా.. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారిని ఎలాన్ మస్క్ కలిశారని వార్తలు వెలువడ్డాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. న్యూయార్క్‌లోని రాయబారి అమీర్ సయీద్ ఇరవాణి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో ఇరాన్‌- అమెరికాల మధ్య ఉద్రిక్తతను తగ్గించే మార్గాలపై చర్చించారు. అయితే, ఇరాన్‌కు బద్ధ వ్యతిరేకులైన విదేశాంగ కార్యదర్శి నామినీ మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్‌లకు ఈ సమావేశం గురించి తెలుసా లేదా అనేది నివేదికలో స్పష్టంగా లేదు. మరోవైపు, ఇరాన్ రాయబారితో మస్క్ భేటీ ‘పాజిటివ్’ అని ఇద్దరు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.