NTV Telugu Site icon

Israeli Strikes: శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దాడి.. పది మంది మృతి.. 40 మందికి గాయాలు

Israeli Strikes

Israeli Strikes

Israeli Strikes: గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలో ఆహారం కోసం బారులు తీరిన వారిపై ఇజ్రాయెల్ ట్యాంక్ కాల్పులు జరపడంతో 10 మంది పాలస్తీనియన్లు మరణించగా, 40 మంది గాయపడ్డారు. అంతేకాకుండా, ఇజ్రాయెల్ విమానాలు అల్ అవదా, అల్ అక్సా హాస్పిటల్ కాంప్లెక్స్‌ లపై కూడా బాంబు దాడి చేశాయి. ఇందులో 22 మంది మరణించారు. అలాగే, గాజాలోని నుసిరత్ శరణార్థి ప్రాంతంలో ఉన్న అల్ ముఫ్తీ స్కూల్ భవనంలో ఆశ్రయం పొందుతున్న వారిపై కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడిలో 19 మంది చనిపోయారు. ఈ దాడుల్లో మృతి చెందిన వారిలో 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఆహార పదార్థాలతో కూడిన ట్రక్కులను ఇజ్రాయెల్ సైన్యం ఆపడం వల్ల గాజాలోని నిరాశ్రయులైన పాలస్తీనియన్లపై కూడా ఆకలి ఛాయలు అలుముకున్నాయి. ఐక్యరాజ్యసమితి, అమెరికా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే ఈ ట్రక్కులను గాజాలోకి అనుమతించాలని ఇజ్రాయెల్‌ను కోరాయి. ఈ ట్రక్కులు ఈజిప్ట్ నుండి గాజాకు వెళ్తున్నాయి.

Puneet Superstar: రీల్స్ కోసం ఇంత హంగామా అవసరమా..? గేదె మూత్రం, పేడతో ఏకంగా..(వీడియో)

ఉత్తర లెబనాన్‌లోని క్రైస్తవులు అధికంగా ఉండే పట్టణంలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 18 మంది మరణించారు. తమ దాడిలో సీనియర్ హిజ్బుల్లా కమాండర్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. కాగా, దక్షిణ లెబనాన్‌ లోని మరో 25 గ్రామాలను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైన్యం సాధారణ ప్రజలకు సందేశం ఇచ్చింది. ఇజ్రాయెల్‌ లోని బిన్యామినా నగరంలో సైనిక స్థావరంపై ఆదివారం రాత్రి హిజ్బుల్లా డ్రోన్ దాడిలో నలుగురు సైనికులు మరణించారు. దాడిలో గాయపడిన దాదాపు 60 మంది సైనికుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వైమానిక రక్షణను మోహరించినప్పటికీ హిజ్బుల్లా డ్రోన్ దాడి విజయవంతం కావడంపై ఇజ్రాయెల్ సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. ఆపై దర్యాప్తు ప్రారంభించింది. ఇజ్రాయెల్ ఆర్మీకి చెందిన ఎలైట్ గోలానీ బ్రిగేడ్‌ను లక్ష్యంగా చేసుకుని హిజ్బుల్లా ఈ దాడికి పాల్పడింది.

T20 World Cup 2024: భారత్ సెమీస్‌ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయిందిగా!

Show comments