Israeli Strikes: గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలో ఆహారం కోసం బారులు తీరిన వారిపై ఇజ్రాయెల్ ట్యాంక్ కాల్పులు జరపడంతో 10 మంది పాలస్తీనియన్లు మరణించగా, 40 మంది గాయపడ్డారు. అంతేకాకుండా, ఇజ్రాయెల్ విమానాలు అల్ అవదా, అల్ అక్సా హాస్పిటల్ కాంప్లెక్స్ లపై కూడా బాంబు దాడి చేశాయి. ఇందులో 22 మంది మరణించారు. అలాగే, గాజాలోని నుసిరత్ శరణార్థి ప్రాంతంలో ఉన్న అల్ ముఫ్తీ స్కూల్ భవనంలో ఆశ్రయం పొందుతున్న వారిపై కూడా గాలింపు…