Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan: ఐపీఎల్ 2026 సీజన్‌ను ఆరంభంలో తడబడుతూ మొదలుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. మొదటి మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న SRH, ఆ తర్వాత గేమ్ ప్లాన్‌ను పూర్తిగా మార్చుకుని విజయాల బాట పట్టింది. ఈ మార్పులో కీలక పాత్ర పోషించిన ఆటగాడు ఇషాన్ కిషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్ జట్టును సమర్థంగా నడిపించాడు. అనుభవజ్ఞులైన బౌలర్లు ఫలితాలు ఇవ్వకపోవడంతో, యువ ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇచ్చి జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. బ్యాటర్లు దూకుడుగా ఆడగా, బౌలర్లు కూడా సమయానికి వికెట్లు తీస్తూ జట్టుకు మద్దతుగా నిలిచారు. శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ ఆడుతూ 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఎడమచేతి బ్యాటర్ గా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఈ సీజన్లో ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 80 పరుగులు చేసిన ఇషాన్, అదే జోరును రాజస్థాన్ రాయల్స్ పై 91 & 74 పరుగులతో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 200+ స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు. అభిషేక్ శర్మతో కలిసి అతను నిర్మించిన భాగస్వామ్యాలు మ్యాచ్ లను పూర్తిగా SRH వైపు తిప్పుతున్నాయి.
80(38) vs RCB.
91(44) vs RR.
74(31) vs RR.Ishan Kishan deserves a Hundred, 3 scores of 70+, he has been remarkable in big moments in T20s in 2026 👑👏 pic.twitter.com/NHJQDxkvnf
— Johns. (@CricCrazyJohns) April 25, 2026
రాస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ అనంతరం ఇషాన్ మాట్లాడుతూ.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై ప్రశంసలు కురిపించాడు. “కెప్టెన్‌గా ఉండటం తనకు సరదాగా అనిపించిందని.. కానీ కమిన్స్ అద్భుత నాయకుడని అన్నారు. ఇప్పుడిక నేను నా బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌పైనే దృష్టి పెడతానని అని తెలిపాడు. అలాగే భయపడకుండా షాట్లు ఆడాలని, పవర్‌ప్లేలో మంచి ప్రారంభం ఎంతో కీలకమని తెలిపారు. అభిషేక్ శర్మ కూడా ఈ మధ్య అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. గత మూడు ఇన్నింగ్స్‌లో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో SRH విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరి ఫామ్ SRH జట్టుకు పెద్ద ప్లస్‌గా మారింది.
ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగు విజయాలు సాధించి పాయింట్స్ పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో, ప్లేఆఫ్స్ రేసులో బలమైన జట్టుగా అవతరించింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!