Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్‌గా ఇషాన్ కిషన్.!
- ఐసీసీ టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్
- నెం.1 ర్యాంక్ ను కైవసం చేసుకున్న ఇషాన్ కిషన్
- 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానం
- 869 పాయింట్లతో అభిషేక్ శర్మ రెండో స్థానం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan ICC No.1 T20I Batter: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్ కం బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) నెం.1 ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి ఇషాన్ ప్రపంచ నెం.1 టీ20 బ్యాటర్‌గా నిలిచాడు.
ఇషాన్ కిషన్ ప్రస్తుతం 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అభిషేక్ శర్మ 869 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. గత దాదాపు ఏడాది కాలంగా అభిషేక్ శర్మ ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ.. టీ20 ప్రపంచకప్‌లో ఇషాన్ చేసిన అద్భుత ప్రదర్శన అతడిని అగ్రస్థానానికి చేర్చింది. టీ20 ప్రపంచకప్‌లో 317 పరుగులు సాధించిన అతడు దాదాపు 200 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
ఈ ఘనతతో ఇషాన్ కిషన్ భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ తర్వాత చేరిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇక ఈ లిస్ట్ లో పాకిస్థాన్‌కు చెందిన సాహిబ్జాదా ఫర్హాన్ 848 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక వీరితోపాటు టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ తిలక్ వర్మ 747 పాయింట్లతో ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానానికి చేరాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెరో స్థానం దిగజారారు. వరుణ్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉండగా.. బుమ్రా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మాత్రం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ నంబర్‌వన్ స్థానానికి ఎగబాకగా.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ మూడో స్థానానికి పడిపోయాడు. భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి చేరాడు. మరోవైపు ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం కోల్పోయి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. రిషభ్ పంత్ 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. బౌలర్ల టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్ బౌలర్‌గా ఉన్నాడు.
𝑹𝒊𝒔𝒊𝒏𝒈 𝒕𝒐 𝒕𝒉𝒆 𝒕𝒐𝒑 ⭐
Ishan Kishan reaches the No.1 spot in the ICC Men's T20I Batting Rankings 👏
Read more ➡️ https://t.co/KoXIJ9D3PM pic.twitter.com/0z5Q513cYt
— ICC (@ICC) July 1, 2026
𝗧𝗵𝗲 𝗡𝗲𝘄 𝗪𝗼𝗿𝗹𝗱 𝗡𝗼.𝟭🌟
Congratulations to Ishan Kishan on topping the charts in the ICC Men's T20I Batting Rankings following his massive impact in #TeamIndia’s triumph at the #T20WorldCup 2026 👏👏 @ishankishan51 pic.twitter.com/qQrGnJNdMF
— BCCI (@BCCI) July 1, 2026
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!