చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమాను డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ ముందుగా 2015లో సూర్య తో అనౌన్స్‌చేశాడు. కానీ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో సూర్య ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ మూవీని గౌతమ్ మీనన్ 2017లో విక్రమ్‌తో మొదలుపెట్టాడు. అదే ఏడాది షూటింగ్‌ను కూడా పూర్తిచేసి రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఏడేళ్ల పాటు ఈ సినిమా రిలీజ్ కాలేదు.ఇప్పటికే ఆరు సార్లు ధృవ నక్షత్రం రిలీజ్ వాయిదాపడింది.అయితే ఈ మూవీ 2023 నవంబర్ 24 ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్ర ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఓవర్‌సీస్‌లో కొన్ని చోట్ల ప్రీమియర్స్‌ను కూడా స్క్రీనింగ్ చేశారు. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా ధృవనక్షత్రం మరోసారి వాయిదాపడింది. రిలీజ్ రోజు కూడా ఈ సమస్యలను క్లియర్ చేసేందుకు డైరెక్టర్ గౌతమ్ మీనన్ చాలా ప్రయత్నించారు. కానీ అవి పరిష్కారం కాకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం ధృవ నక్షత్రం రిలీజ్‌కు సంబంధించిన అడ్డంకులను క్లియర్ చేసే పనిలో గౌతమ్ మీనన్ బిజీగా ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే విక్రమ్ ధృవ నక్షత్రం రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ సారి ధృవ నక్షత్రం ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని కోలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.ఫిబ్రవరి నెలలో ఈ స్పై అండ్ యాక్షన్ మూవీ విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 16 లేదా 23లలో ఏదో ఒక రోజు ఈ మూవీ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏ తేదీన ధృవ నక్షత్రం విడుదల అవుతుందన్నది త్వరలోనే ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సారి కూడా రిలీజ్ కావడం అనుమానమేనని విక్రమ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. విక్రమ్ కూడా ఈ సినిమా రిలీజ్‌పై ఆశలు వదలుకున్నాడు. ధృవ నక్షత్రం ప్రమోషన్స్‌కు కూడా దూరంగా ఉంటున్నాడు..మరి ఫిబ్రవరిలోనైనా ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదో చూడాలి మరి.