పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `సలార్`. ఈ మూవీకి `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే..దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. మొదటి భాగాన్ని `సలార్ సీజ్‌ఫైర్`తో విడుదల చేయనున్నారు. ఇక రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. అలాగే అత్యధిక వ్యూస్ పొందిన గ్లింప్స్ గా రికార్డ్ కూడా క్రియేట్ చేసింది..ఈ సినిమాని కేజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దాదాపు 350కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తుంది..భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను చిత్ర యూనిట్ సెప్టెంబర్ 28 న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమా వాయిదా పడబోతుందనే వార్తలు గత రెండు రోజులుగా తెగ వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం అలాగే ఔట్‌పుట్‌పై దర్శకుడు ప్రశాంత్ నీల్ అంతగా సంతృప్తికరంగా లేకపోవడంతో సినిమాని వాయిదా వేయాలనుకుంటున్నట్టు సోషల్ మీడియాలో తెగ వార్తలొచ్చాయి.అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ఈ విషయాన్ని గురించి అధికారికంగా ప్రకటించలేదు, కానీ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అధికారికంగా `సలార్` పోస్ట్ పోన్ విషయాన్ని అయితే వెల్లడించారు.`సలార్` మూవీ సెప్టెంబర్ 28న విడుదల కావడం లేదు, నవంబర్‌కి పోస్ట్ పోన్ అవుతుందని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయని దీంతో హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని, వారు న్యూ రిలీజ్ డేట్ ను త్వరలో వెల్లడించనున్నారని తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.. సినిమా సీజీ వర్క్ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ అంతగా సాటిస్పై కాకపోవడం వల్లే సలార్ సినిమా వాయిదా పడుతున్నట్లు సమాచారం.వీఎఫ్‌ఎక్స్ వర్క్ శుక్రవారమే అందించాల్సి ఉంది, కానీ అవి ఇంకా రాకపోవడంతో రిస్క్ తీసుకోవడం మంచిది కాదని దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.అయితే ఈచిత్రాన్ని నవంబర్ 10 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి చిత్ర యూనిట్ ఈ విషయం పై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
https://twitter.com/taran_adarsh/status/1697895717572943984?s=20