ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో రోహిత్ శర్మ..? ఉన్నట్లు సమాచారం. తన భవిష్యత్‌పై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌తో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read Also: IND vs NZ Finals: ఇండియా గెలవాలని గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు పూజలు..
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. నిన్న రోహిత్ శర్మ ప్రెస్‌మీట్‌కి హాజరు కాలేదు. రోహిత్ స్థానంలో ప్రెస్‌మీట్‌కి శుభ్‌మాన్ గిల్ వచ్చాడు. ఈ క్రమంలో.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై గిల్ స్పందించాడు. కెప్టెన్‌తో సహా అందరి దృష్టి ఫైనల్‌పైనే ఉంది.. రోహిత్ భవిష్యత్తు గురించి ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కానీ, వ్యక్తిగతంగా తనతో కానీ రిటైర్మెంట్ పై ఎలాంటి చర్చ చేయలేదని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధికగా 3 డబుల్ సెంచరీలు చేశాడు. వరల్డ్ కప్‌ల్లో అత్యధిక 7 సెంచరీలు చేశాడు. ఆటగాడిగా రోహిత్ శర్మపై ఎన్నో రికార్డులు ఉన్నాయి. టీ20ల్లో 35 బంతుల్లోనే అత్యంత వేగంగా సెంచరీ సాధించిన క్రికెటర్‌గా రోహిత్ పేరును లిఖించుకున్నాడు.
Read Also: Crime: ఎన్నారై మహిళ మృతి కేసులో కొనసాగుతున్న మిస్టరీ!
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా 7వ ఐసిసి టైటిల్‌పై కన్నేసింది. ఇంతకు ముందు.. భారత్ 2 వన్డే ప్రపంచ కప్‌లు (1983, 2011), రెండు టీ 20 ప్రపంచ కప్‌లు (2007, 2024), రెండు ఛాంపియన్స్ ట్రోఫీలను (2002, 2013) గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించాలని రోహిత్ సేన చూస్తోంది. కాసేపట్లో దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో.. భారత్ గెలవాలంటూ టీమిండియా ఫ్యాన్స్ పూజలు, హోమాలు చేస్తున్నారు. మరోవైపు.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పై జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. రూ. 5 వేల కోట్లు చేతులు మారబోతున్నాయి. దుబాయ్ నుంచి క్రికెట్ బెట్టింగ్స్ నడుస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు.