Sankranthiki Vasthunam : వెంకటేశ్ హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి లేడి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు మేకర్స్. అందులో భాగంగానే ఈ సినిమాలోని ‘గోదారి గట్టుమీద రామసిలకవే గోరింటాకు ఎట్టుకున్న సందమామవే’ సాగె ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల ఈ సాంగ్ ను రచించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
Read Also:Kusal Perera: కొత్త ఏడాది మొదటిరోజే 14 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన కుశాల్ పెరీరా
చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఒకప్పటి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ రమణగోగుల ఈ పాట పాడడం విశేషం. ఆయనతో పాటు మధు ప్రియా ఈ సాంగ్ పాడింది. ఈ పాటకు సాలీడ్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు సాంగ్స్ రాగా అవి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అంటూ సాగే ఈ ఎలక్ట్రిఫయింగ్ సాంగ్ కోసం హీరో వెంకటేష్ తన గాత్రం ఇచ్చారు. అయితే ఇపుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ పై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ జనవరి 6న మేకర్స్ మంచి ఎంటర్టైనింగ్ గా ఉండే ట్రైలర్ కట్ ని వదలబోతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా తాను ఇచ్చిన అన్ని పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.
Read Also:Gold Rate Today: కొత్త ఏడాదిలో వరుస షాక్‌లు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?