ACB Raids : కరీంనగర్‌కు చెందిన నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శ్రీధర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం తెల్లవారుజామున భారీగా దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్‌పై నమోదైన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు, పెద్దఎత్తున అక్రమ ఆస్తులు వెలుగులోకి తీసుకొచ్చారు. కరీంనగర్, సిద్ధిపేట్, వరంగల్, హైదరాబాద్ సహా మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న శ్రీధర్ నివాసంలో సోదాలు ప్రారంభమై తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగాయి.
Vijayawada: “సుపరిపాలన.. తొలి అడుగు” పేరుతో కూటమి ప్రభుత్వ వార్షికోత్సవ సభ..!
శ్రీధర్ దంపతుల పేరుపై నమోదు అయిన ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయన హైదరాబాద్ శేక్‌పేట్‌లో ఉన్న స్కై హైటెడ్ అపార్ట్మెంట్‌లో రూ.4500 చదరపు అడుగుల విల్లా, అమీర్‌పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, మూడు ఫ్లాట్లు, మూడు ఇండివిడ్వల్ హౌస్‌లు, 19 ఫ్లాట్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు రెండు కార్లు, భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడి పెళ్లిని థాయిలాండ్‌లో జరిపించిన శ్రీధర్, నగరంలోని పేరుగాంచిన హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఇంకా ఆయనకు సంబంధించి బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉంది.
బుధవారం అర్థరాత్రి శ్రీధర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, ఇవాళ ఉదయం 6 గంటలకు ఆయనను చంచల్‌గూడ జైలుకు రిమాండ్ చేశారు. ఈ కేసు రాష్ట్రంలో మరో సంచలన అవినీతి దర్యాప్తుగా నిలుస్తుందని భావిస్తున్నారు. శ్రీధర్‌పై కేసు నమోదు చేసి పూర్తి ఆస్తుల లెక్కలు తేల్చేందుకు ఏసీబీ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.
Schools Reopen : వేసవి సెలవులకు గుడ్‌బై.. పండుగ వాతావరణంలో స్కూల్స్ రీఓపెన్
